Telugu Global
Cinema & Entertainment

ఏప్రిల్ 17 టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్

గ‌త శుక్ర‌వారం (ఏప్రిల్ 17 ) నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. వాటిలో వార‌ధి, బుడుగు, ఓరి దేవుడోయ్ డైరెక్ట్ తెలుగు కాగా, ఓ.కే.బంగారం డ‌బ్బింగ్ సినిమా. వార‌ధి డిఫ‌రెంట్ సినిమా అని చూసిన‌వాళ్ళు అన్న‌ప్ప‌టికి త‌ర్వాత చూసేవాళ్ళు క‌న్పించ‌డం లేదు. బుడుగు సినిమా కూడా హార‌ర్ జోన‌ర్ లో నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఓరి దేవుడోయ్ ప‌ట్టించుకున్న‌వాళ్లు లేరు. ఓ.కే. బంగారం సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా రైట్స్ చాలా త‌క్కువ మొత్తంలో తీసుకోవ‌డంతో దిల్ రాజు […]

ఏప్రిల్ 17 టాలీవుడ్ బాక్సాఫీస్ రిపోర్ట్
X

గ‌త శుక్ర‌వారం (ఏప్రిల్ 17 ) నాలుగు సినిమాలు విడుద‌ల‌య్యాయి. వాటిలో వార‌ధి, బుడుగు, ఓరి దేవుడోయ్ డైరెక్ట్ తెలుగు కాగా, ఓ.కే.బంగారం డ‌బ్బింగ్ సినిమా. వార‌ధి డిఫ‌రెంట్ సినిమా అని చూసిన‌వాళ్ళు అన్న‌ప్ప‌టికి త‌ర్వాత చూసేవాళ్ళు క‌న్పించ‌డం లేదు. బుడుగు సినిమా కూడా హార‌ర్ జోన‌ర్ లో నిల‌బ‌డ‌లేక‌పోయింది. ఓరి దేవుడోయ్ ప‌ట్టించుకున్న‌వాళ్లు లేరు. ఓ.కే. బంగారం సూప‌ర్ హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ సినిమా రైట్స్ చాలా త‌క్కువ మొత్తంలో తీసుకోవ‌డంతో దిల్ రాజు పంట పండింది. యూత్ కి స‌రైన సినిమా ఈ సీజన్ కి లేని లోటు మ‌ణిరత్నం తీర్చాడు. దాదాపు 20 కోట్ల వ‌ర‌కూ వ‌సూలు చేసే అవ‌కాశం ఉంది . మొన్న జ‌రిగిన ఎర్ర చంద‌నం ఎన్ కౌంట‌ర్ నేప‌ధ్యంలో త‌మిళ‌నాడు లో తెలుగు సినిమా లు ఆడ‌నివ్వ‌కుండా చేశారు తాత్కాలికంగా. మ‌న తెలుగు వాళ్లు మాత్రం ఏ భాషా చిత్రాన్ని అయినా ఆద‌రిస్తామ‌ని త‌మ సంస్కారం చాటుకున్నారు. బాధాక‌ర‌మైన విష‌యం ఏమిటంటే టివి ఛానెల్స్ కాని, వెబ్ సైట్స్ కాని డ‌బ్బింగ్ సినిమా రివ్యూలు రాశారు , తెలుగు సినిమాల గురించి ఒక్క ముక్క కూడా రాయ‌లేదు. అవి బాగుండ‌ని- బాగుండ‌క పోనీ, వారి త‌ప్పు కూడా లేదు-మీడియా మీద ఆంక్ష‌లు విధిస్తూ , చిన్న సినిమాలకు చోటు ఇవ్వ‌కుండా డ‌బ్బింగ్ సినిమాలను పెద్ద నిర్మాత‌లే త‌ల‌మీద పెట్టుకుంటే మీడియా మాత్రం ఏం చేస్తుంది ?

First Published:  20 April 2015 5:09 AM IST
Next Story