ఎన్‌కౌంటర్‌కు బాధ్యుడు చంద్రబాబే: సీపీఐ
ఒంగోలు: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని సీపీఐ నాయకుడు కె. నారాయణ అన్నారు. ఒకేసారి 20 మంది కూలీలను కాల్చి చంపిన పోలీసులు వారికి స్మగ్లర్లుగా పేరు పెట్టారని ఆరోపించారు. అసలు 20 మందిని కాల్చి చంపే ధైర్యం పోలీసులకు ఉండదని, ముందుగా ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ఘాతుకానికి పోలీసులు పాల్పడి ఉంటారని నారాయణ అన్నారు. అందువల్ల ఈ ఎన్‌కౌంటర్ కేసులో ప్రథమ ముద్దాయిగా చంద్రబాబుపై […]
BY Pragnadhar Reddy19 April 2015 5:45 AM IST

X
Pragnadhar Reddy Updated On: 19 April 2015 5:49 AM IST
ఒంగోలు: శేషాచలం ఎన్‌కౌంటర్‌కు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే బాధ్యత వహించాలని సీపీఐ నాయకుడు కె. నారాయణ అన్నారు. ఒకేసారి 20 మంది కూలీలను కాల్చి చంపిన పోలీసులు వారికి స్మగ్లర్లుగా పేరు పెట్టారని ఆరోపించారు. అసలు 20 మందిని కాల్చి చంపే ధైర్యం పోలీసులకు ఉండదని, ముందుగా ఈ విషయాన్ని చంద్రబాబుకు చెప్పి అనుమతి తీసుకున్న తర్వాతే ఈ ఘాతుకానికి పోలీసులు పాల్పడి ఉంటారని నారాయణ అన్నారు. అందువల్ల ఈ ఎన్‌కౌంటర్ కేసులో ప్రథమ ముద్దాయిగా చంద్రబాబుపై కేసు పెట్టాలని ఆయన అన్నారు.
Next Story