చీరలు మాట్లాడుతున్నాయి!
ముంబయిలో ధారవి అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సంస్థ మురికివాడల్లో నివసించే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోంది. ఈ తరహా సంస్థల్లో ఇది ఆసియాలోనే పెద్దది. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ధారవి ఒక వినూత్న కార్యక్రమాన్నినిర్వహిస్తోంది. ఈ సంస్థని ఆధారం చేసుకుని అనేకమంది హింసకు గురయిన మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఈ మహిళలు తాము ధరించే చీరలపై హింసకు వ్యతిరేక నినాదాలను, చిత్రాలను ముద్రించి ప్రదర్శిస్తున్నారు. తమ నిరసనను […]
ముంబయిలో ధారవి అనే స్వచ్ఛంద సంస్థ ఉంది. 500 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ సంస్థ మురికివాడల్లో నివసించే ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తోంది. ఈ తరహా సంస్థల్లో ఇది ఆసియాలోనే పెద్దది. మహిళలపై జరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ధారవి ఒక వినూత్న కార్యక్రమాన్నినిర్వహిస్తోంది. ఈ సంస్థని ఆధారం చేసుకుని అనేకమంది హింసకు గురయిన మహిళలు ఉపాధి పొందుతున్నారు. ఈ మహిళలు తాము ధరించే చీరలపై హింసకు వ్యతిరేక నినాదాలను, చిత్రాలను ముద్రించి ప్రదర్శిస్తున్నారు. తమ నిరసనను బలంగా, ధైర్యంగా వినిపిస్తున్నా రు. వీరిలో భిన్నరకాలున్నారు. కాలేజికి వెళ్లే విద్యార్థినులు, ఉద్యోగినుల నుండి ఇళ్లలో వంట, ఇతర పనులు చేసే వారి వరకు ఉన్నారు. నలభై సంవత్సరాల నిర్మల అనే మహిళ ప్యూర్ సిల్క్ ఆకుపచ్చ చీర కొంగుమీద డోంట్ టచ్ మీ అనే అక్షరాలను ప్యాచ్ వర్క్ ద్వారా ముద్రించింది. ఆహుతులకోసం ఏర్పాటు చేసిన ఒక ప్రదర్శనలో ఆమె నిలువెత్తు ఫొటో ఈ చీరను ధరించి కనబడుతుంది. ఈ ప్రదర్శనను చూసేందుకు వచ్చినవారికి వీరు ఎంతో ఉత్సాహంగా తమ సృజనను చూపిస్తారు. రూతా డేవిడ్ అనే మరో మహిళ ధరించిన నల్లని చీర కొంగుమీద రేపిస్టులను బంధించండి…బాధితులను కాదు, అనే అక్షరాలు కనబడతాయి. నిజమైన ఇత్తడి తాళం చెవులు వేలాడుతూ కనిపించే ఈ చీరపై వర్క్ చేయడానికి తనకు చాలా సమయం పట్టిందని రూతా చెబుతోంది. అంజలి అనే మహిళ ధరించిన చీరమీద స్టాప్ రేప్ అనే అక్షరాలతో పాటు అనేక చేతులు ప్యాచ్ వర్క్ తో ముద్రించి ఉంటాయి. ధారవి ప్రాంగణంలో నిర్వహించిన మూడువారాల ఆర్ట్స్ అండ్ పబ్లిక్ హెల్త్ ఫెస్టివల్ లో వీటిని ప్రదర్శించారు. ఇవే కాక ఈ ప్రదర్శనలో స్లమ్ ఏరియాల్లో నివసించే అనేక మంది తయారుచేసిన కళాకృతులను సైతం ప్రదర్శించారు. బతుకు పోరాటంలో వివిధ పనులు చేసుకునే వీరంతా నిపుణుల సూచనలతో పలు కళాకృతులు సృష్టించడం విశేషం. ఇక తిరిగి మహిళల విషయానికి వస్తే…ఇప్పటివరకు సమాజంనుండి ఏదో ఒక రూపంలో హింసని పొంది, అనుభవించి ఉన్నవారు, ఇప్పుడు సమాజానికి తమ గొంతు వినిపిస్తున్నారు. జరీనా ఖాన్ అనే ధారవి మహిళ భర్త పెట్టిన హింసని ఎన్నో ఏళ్లు భరించి చివరి రెండేళ్ల క్రితం అతని నుండి విడిపోయింది. ఇప్పుడు అతడిని రోడ్డుపైన కొట్టడానికి సైతం తాను భయపడనంటోంది ఆమె. వంటమనిషిగా పనిచేస్తూ ఉపాధి పొందుతున్న జరీనా తనలాంటి మహిళలకు అండగా నిలుస్తోంది. వీరందరికీ సమాజంలోని వివిధ రంగాల్లో ఉన్న నిపుణులు సహాయమందిస్తున్నారు.. సుశీ విఖరీ అనే టెక్స్ టైల్ ఆర్టిస్ట్ పైన పేర్కొన్న చీరల డిజైనింగులో సలహాలను ఇస్తే, ఢిల్లీ ఫిల్మ్ మేకర్ మనీష్ శర్మ మరో సినిమాటోగ్రాఫర్‌తో కలిసి వీరికి డాక్యమెంటరీ రూపకల్పనలో పదిరోజుల వర్క్ షాప్ నిర్వహించారు. ఏదిఏమైనా హింసను ఎదుర్కోవటంలో ఒంటరి మహిళకూ, సమూహం అండ ఉన్న మహిళకు మధ్య ఉన్న తేడాను ధారవి నిరూపించింది.