Telugu Global
Cinema & Entertainment

సూప‌ర్ డూప‌ర్ హిట్ 'మా ఎన్నిక‌ల మూవీ '

న‌టీన‌టులు సినిమాల్లోనే న‌టిస్తారు. ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఈసారి తెర బ‌య‌ట కూడా బాగా న‌టించారు. రెండు నెల‌ల నుంచి ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఫైటింగ్‌ల సీన్లు లేక‌పోయినా సినిమాను మాత్రం బాగా ఇంట్ర‌స్టింగ్‌గా తీసుకొచ్చారు. 702 ఓట్లు మాత్ర‌మే ఉన్న మా ఎన్నిక‌ల‌ను సాధార‌ణ ఎన్నిక‌ల్లా క‌ల‌రింగ్ వ‌చ్చేలా చేసుకున్నారు. 702 మందికి త‌ప్ప మిగిలిన వారెవ‌రికీ ఏమాత్రం ప్ర‌యోజనం క‌ల‌గ‌ని ఎన్నిక‌లు రాష్ట్ర అంశమ‌న్నంత‌గా చిత్రీక‌రించారు.ఇంతా […]

సూప‌ర్ డూప‌ర్ హిట్ మా ఎన్నిక‌ల మూవీ
X

న‌టీన‌టులు సినిమాల్లోనే న‌టిస్తారు. ప్రేక్ష‌కుల‌ను రంజింప‌జేస్తారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ ఎన్నిక‌ల పుణ్య‌మా అని ఈసారి తెర బ‌య‌ట కూడా బాగా న‌టించారు. రెండు నెల‌ల నుంచి ఈ సినిమా ఆడుతూనే ఉంది. ఫైటింగ్‌ల సీన్లు లేక‌పోయినా సినిమాను మాత్రం బాగా ఇంట్ర‌స్టింగ్‌గా తీసుకొచ్చారు. 702 ఓట్లు మాత్ర‌మే ఉన్న మా ఎన్నిక‌ల‌ను సాధార‌ణ ఎన్నిక‌ల్లా క‌ల‌రింగ్ వ‌చ్చేలా చేసుకున్నారు. 702 మందికి త‌ప్ప మిగిలిన వారెవ‌రికీ ఏమాత్రం ప్ర‌యోజనం క‌ల‌గ‌ని ఎన్నిక‌లు రాష్ట్ర అంశమ‌న్నంత‌గా చిత్రీక‌రించారు.ఇంతా చేసి పోలైన ఓట్లు 394. ఎన్నికల్లో ఓటు వేయ్యడం పౌరుడిగా మీ బాధ్యత అని డబ్బులు తీసుకొని ఎన్నికల కమీషన్ ప్రకటనల్లో నటీంచిన నటులు కూడా ఓటింగ్ కు గైర్హాజరు కావడం కొసమెరుపు.

మామూలు జ‌నానికి సంబంధం లేక‌పోయినా, వారిపై ఏమాత్రం ప్ర‌భావం చూప‌క‌పోయినా ‘అదే ఇంపార్టెంట్’ అన్న ప‌రిస్థితిని తీసుకొచ్చారు. అంద‌కు అంద‌రూ స‌హ‌క‌రించారు. పాత తరం సినిమాలో హీరో హీరోయిన్ల‌లా ఓ వైపు జ‌య‌సుధ‌, మ‌రోవైపు రాజేంద్ర‌ప్ర‌సాద్ మా ఎన్నిక‌ల తెర‌పై బాగా న‌టించారు. రాజ‌కీయ పార్టీ నేత‌ల‌కు ఏ మాత్రం తీసిపోకుండా విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లు, ప్రెస్‌మీట్లు, లైవ్ ప్రోగ్రాంలు ఒక‌టా రెండా రెండు నెల‌లు గొప్ప గొప్ప సీన్లే క‌నిపించాయి. మ‌ధ్య‌లో కోర్టు కేసు. వాయిదాలు. కౌంటింగ్ ఆగిపోవ‌డం, జ‌నంలో టెన్ష‌న్ మ‌రింత పెంచ‌డం. ఆహా ఎం నటించారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ అధ్య‌క్షుడిగా 85 ఓట్ల మెజార్టీతో గెలిచారు. ఇక అది కూడా పెద్ద విజ‌యం. కేంద్రంలో దాదాపు మూడు ద‌శాబ్దాల త‌ర్వాత బీజేపీ సొంతంగా మెజార్టీ సాధించి ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసిన దానికంటే మించిన ప్ర‌చారం రాజేంద్ర‌ప్ర‌సాద్‌కు వ‌చ్చింది.
తెర‌వెనుక ఉండి… కాదు కాదు తెర ముందుకే వ‌చ్చారు కాబ‌ట్టి నాగ‌బాబు, ముర‌ళీమోహ‌న్‌ల్లో ఎవ‌రిది ఓట‌మి? మ‌రెవ‌ర‌ది గెలుపు? అన్న విశ్లేష‌ణ‌లూ సాగాయి. రోజు రోజంతా ‘మా సంద‌డే సంద‌డి. రాజేంద్ర‌ప్ర‌సాద్ మా అధ్య‌క్షుడ‌య్యాడు స‌రే, దాని వ‌ల్ల ప్రేక్ష‌కులకు ఏమైనా ఒరుగుతుందా? మా జనం ప‌రిస్థితి మారుతుందా? న‌టీన‌టులు కాబ‌ట్టి కొంత ఇంట్ర‌స్టింగా ఉన్న మాట నిజ‌మే. కానీ అదే ఇంపార్టెంట్ కాదు. రాష్ట్రంలో ఈ విషయమే ముఖ్యము.. ఇంకేమీ లేదు. అన్నంత‌గా మా ఎన్నిక‌ల సినిమా న‌డిచింది.

First Published:  18 April 2015 6:06 AM IST
Next Story