Telugu Global
CRIME

రైలు దోపిడీని అడ్డుకున్న ప్రయాణీకులు

విజయవాడ చెన్నై మార్గంలో రైలు దోపిడీకి విఫలయత్నం జరిగింది.  వలివేరు-చుండూరు మధ్య శుక్రవారం అర్థరాత్రి గ్రాండ్ ట్రంక్  ఎక్స్ ప్రెస్ లో కొందరు దుండగులు దోపిడీకి ప్రయాణించారు. ప్రయాణీకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు పరారయ్యారు. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న జీటీ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చుండూరు మండలం వలివేరు రైలు క్రాసింగ్ దాటగానే అలారం చైన్ లాగి రైలును నిలిపేశారు. బయట ఉన్న మరి కొందరు దుండగులు లోపలికి రావడానికి ప్రయత్నించారు. […]

విజయవాడ చెన్నై మార్గంలో రైలు దోపిడీకి విఫలయత్నం జరిగింది. వలివేరు-చుండూరు మధ్య శుక్రవారం అర్థరాత్రి గ్రాండ్ ట్రంక్ ఎక్స్ ప్రెస్ లో కొందరు దుండగులు దోపిడీకి ప్రయాణించారు. ప్రయాణీకుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవడంతో దుండగులు పరారయ్యారు. విజయవాడ నుంచి చెన్నై వెళుతున్న జీటీ ఎక్స్ ప్రెస్ లో దుండగులు చుండూరు మండలం వలివేరు రైలు క్రాసింగ్ దాటగానే అలారం చైన్ లాగి రైలును నిలిపేశారు. బయట ఉన్న మరి కొందరు దుండగులు లోపలికి రావడానికి ప్రయత్నించారు. లోపలున్న దుండగులు ఇద్దరు మహిళల మెడలో చైన్లు లాగేందుకు ప్రయత్నించారు. అయితే ఆ మహిళలతో పాటు తోటి ప్రయాణీకులు ప్రతిఘటించడంతో దుండగులు బయటకు దూకి పరారయ్యారు. బయట ఉన్న దుండగులు బోగీ లోనికి రానివ్వకుండా ప్రయాణీకులు అడ్డుకున్నారు. దాంతో వారి దోపిడీ యత్నంవిఫలమయ్యింది. ఈ వ్యవహారమంతా ఓ పావుగంట సేపు కొనసాగిందని ప్రయాణీకులు తెలిపారు. మొత్తం మూడు బోగీల్లో దోపిడీకి దుండగులు ప్రయత్నించారని సమాచారం. అలారం చైన్ పుల్లింగ్ గ్యాంగ్ ఈ ఘటనకు పాల్పడి ఉంటుందని రైల్వే పోలీసులు అనుమానిస్తున్నారు. రైల్వే పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. ఈ గ్యాంగ్ ప్రత్యేకంగా అమావాస్య రోజుల్లోనే సంచరిస్తూ దోపిడీలకు పాల్పడుతున్నదని పోలీసులంటున్నారు.
First Published:  18 April 2015 5:24 AM IST
Next Story