Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 59

తిక్క ప్రశ్న డాక్టర్‌ : ఈ టాబ్లెట్‌ రోజుకు మూడుసార్లు వేసుకోవాలి. పేషెంట్‌ : ఇంత చిన్న టాబ్లెట్‌ని మూడుసార్లు ఎట్లా వేసుకోవాలి సర్‌? అప్పడం కస్టమర్‌ : ఇక్కడ అప్పడమెంత గట్టిగా ఉందయ్యా! వెయిటర్‌: సార్‌! మీరు కొరుకుతున్నది ప్లేటు. ఆర్డర్‌ సోము : ఈ హోటల్లో సర్వీసు చాలా దారుణంగా ఉంటుంది. భాను : ఆర్డరిచ్చావు కదా! అది రానీ! అదెంత దారుణంగా ఉంటుందో చూద్దాం. రూపాయి అంకుల్‌ : చింటూ! నువ్వు ముద్దుగా […]

తిక్క ప్రశ్న

డాక్టర్‌ : ఈ టాబ్లెట్‌ రోజుకు మూడుసార్లు వేసుకోవాలి.
పేషెంట్‌ : ఇంత చిన్న టాబ్లెట్‌ని మూడుసార్లు ఎట్లా వేసుకోవాలి సర్‌?

అప్పడం

కస్టమర్‌ : ఇక్కడ అప్పడమెంత గట్టిగా ఉందయ్యా!
వెయిటర్‌: సార్‌! మీరు కొరుకుతున్నది ప్లేటు.

ఆర్డర్‌

సోము : ఈ హోటల్లో సర్వీసు చాలా దారుణంగా ఉంటుంది.
భాను : ఆర్డరిచ్చావు కదా! అది రానీ! అదెంత దారుణంగా ఉంటుందో చూద్దాం.

రూపాయి

అంకుల్‌ : చింటూ! నువ్వు ముద్దుగా మాట్లాడతావు.
చింటూ : మా మమ్మీ కూడా అట్లాడే అంటుందంకుల్‌
అంకుల్‌ : ఈ రూపాయి తీసుకో.
చింటూ : మా మమ్మీ కూడా రూపాయి ఇచ్చింది.
అంకుల్‌ : ఎందుకు?
చింటూ : మీది కోతి మొఖం అని చెప్పకుంటే రూపాయి ఇస్తానని ఇచ్చింది.

First Published:  18 April 2015 1:30 PM IST
Next Story