Telugu Global
Others

పిల్లల కడుపు మాడుస్తున్న రాజకీయ పట్టింపులు

చిన్నారుల‌కు పౌష్ఠికాహారం అందించే బాలామృత ప‌థ‌కం అట‌కెక్కింది. ప్ర‌తి నెలా సుమారు 17 ల‌క్ష‌ల మంది చిన్నారుల‌కు పోష‌కాహారం అందించే ఈ ప‌థ‌కం నాయ‌కుల్లో చిత్త‌శుద్ధి లేని కార‌ణంగా నిలిచిపోయింది. హైద‌రాబాద్‌లోని నాచారంలో ఉన్న ఏపీ ఫుడ్ ఫ్యాక్ట‌రీలో బాలామృత ప‌థ‌కానికి అవ‌స‌ర‌మ‌య్యే ఆహారం ఉత్ప‌త్తి అయ్యేది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ ఫుడ్స్ ఫ్యాక్ట‌రీపై ఇరు రాష్ట్రాల‌కు ప‌దేళ్ళ‌పాటు అధికారం ఉంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత దీనికి ఎండీగా తెలంగాణ వ్య‌క్తిని నియ‌మించారు. సంస్థ కార్య‌క‌లాపాల్లో […]

పిల్లల కడుపు మాడుస్తున్న రాజకీయ పట్టింపులు
X
చిన్నారుల‌కు పౌష్ఠికాహారం అందించే బాలామృత ప‌థ‌కం అట‌కెక్కింది. ప్ర‌తి నెలా సుమారు 17 ల‌క్ష‌ల మంది చిన్నారుల‌కు పోష‌కాహారం అందించే ఈ ప‌థ‌కం నాయ‌కుల్లో చిత్త‌శుద్ధి లేని కార‌ణంగా నిలిచిపోయింది. హైద‌రాబాద్‌లోని నాచారంలో ఉన్న ఏపీ ఫుడ్ ఫ్యాక్ట‌రీలో బాలామృత ప‌థ‌కానికి అవ‌స‌ర‌మ‌య్యే ఆహారం ఉత్ప‌త్తి అయ్యేది. విభ‌జ‌న చ‌ట్టం ప్ర‌కారం ఏపీ ఫుడ్స్ ఫ్యాక్ట‌రీపై ఇరు రాష్ట్రాల‌కు ప‌దేళ్ళ‌పాటు అధికారం ఉంది. రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత దీనికి ఎండీగా తెలంగాణ వ్య‌క్తిని నియ‌మించారు. సంస్థ కార్య‌క‌లాపాల్లో త‌మ‌కు భాగ‌స్వామ్యం లేకుండా చేశార‌ని ఏపీ ఆరోపిస్తోంది. అక్క‌డి నుంచి ఆహారం తీసుకోడానికి నిరాక‌రిస్తోంది. మ‌రోవైపు జూన్ 2 నుంచి అక్టోబ‌ర్ 31 వ‌ర‌కు స‌ర‌ఫ‌రా చేసిన బాలామృత ఆహారం బిల్లు రూ. 98 కోట్ల‌ను ఏపీ నిలిపివేసింది. బ‌కాయిలు చెల్లిస్తే త‌ప్ప ఆహారం స‌ర‌ఫ‌రా చేయ‌మ‌ని ఏపీ ఫుడ్స్… ఈ సంస్థ‌ను విభ‌జిస్తే త‌ప్ప ఆహారం తీసుకోబోమ‌ని ఏపీ ప్ర‌భుత్వం మొండి ప‌ట్టుద‌ల‌కు పోతున్నాయి. దీంతో పౌష్ఠికాహారం అందాల్సిన చిన్నారుల‌కు మాత్రం అది అంద‌కుండా పోతోంది.
First Published:  18 April 2015 9:41 AM IST
Next Story