రిటైర్ కానున్న అహ్మద్ పటేల్, దిగ్విజయ్ ?
తాము రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమయ్యిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. నేను, అహ్మద్ పటేల్ 38, 33 సంవత్సరాల వయస్సులో పీసీసీ అధ్యక్షులమయ్యాం. అప్పటి నుంచి అనేక పదవులు నిర్వహించాం. పండుటాకులు రాలి పోవాల్సిందే… కొత్త చివుళ్ళు చిగురించాల్సిందే… మా రిటైర్‌మెంట్‌కు టైం దగ్గర పడింది… అని ఆయన వ్యాఖ్యానించారు. సుదీర్ఘ విరామం తర్వాత రాహుల్ ఇంటికి చేరిన మరునాడే దిగ్విజయ్ ఇలాంటి ప్రకటన చేయడం వెనుక కారణాలేమిటన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. ఎన్డీయే ప్రభుత్వం […]
తాము రిటైర్ కావాల్సిన సమయం ఆసన్నమయ్యిందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. నేను, అహ్మద్ పటేల్ 38, 33 సంవత్సరాల వయస్సులో పీసీసీ అధ్యక్షులమయ్యాం. అప్పటి నుంచి అనేక పదవులు నిర్వహించాం. పండుటాకులు రాలి పోవాల్సిందే… కొత్త చివుళ్ళు చిగురించాల్సిందే… మా రిటైర్‌మెంట్‌కు టైం దగ్గర పడింది… అని ఆయన వ్యాఖ్యానించారు. సుదీర్ఘ విరామం తర్వాత రాహుల్ ఇంటికి చేరిన మరునాడే దిగ్విజయ్ ఇలాంటి ప్రకటన చేయడం వెనుక కారణాలేమిటన్నది ఇపుడు చర్చనీయాంశమైంది. ఎన్డీయే ప్రభుత్వం భూ సేకరణ ఆర్డినెన్స్ తీసుకువచ్చిన నేపథ్యంలో ఆదివారం రాహుల్ గాంధీ నేతృత్వంలో జరగనున్న కిసాన్ ర్యాలీకి ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకు సంబంధించి ఎఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, ఇన్‌ఛార్జిలతో ఆయన సమావేశమయ్యారు. పండుటాకులు నెమ్మదిగా రాలిపోతాయి… వాటి స్థానంలో కొత్త చివుళ్ళు చిగురిస్తాయి… ఇది ప్రకృతి ధర్మం… అంటూ వేదాంత ధోరణితో దిగ్విజయ్ మాట్లాడారు. రాహుల్‌కు, సీనియర్లకు మధ్య విభేదాలున్నాయన్న విషయాన్ని ఇపుడు దిగ్విజయ్ చేసిన ప్రకటన చెప్పకనే చెబుతోంది. రాహుల్‌తో వీరికి పొసగక తట్టాబుట్టా సర్ధుకోవలసిన పరిస్థితి ఉంది కాబట్టే దిగ్విజయ్ ఇలాంటి ముందస్తు ప్రకటన చేసి ఉంటారని భావిస్తున్నారు.-పీఆర్