Telugu Global
Cinema & Entertainment

మా కుటుంబానికి న‌వ్వులు పంచుతా: రాజేంద్ర‌ప్ర‌సాద్‌

తాను గెలవాల‌ని కోరుకున్న ప్ర‌తి తెలుగువాడి పాదాల‌కు న‌మ‌స్కారం చేస్తున్నాన‌ని సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ కొత్త అధ్య‌క్షుడు గ‌ద్దె రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వా త ఎన్నో ప‌రీక్ష‌లు త‌ట్టుకుని ఈ గెలుపు సాధించామ‌ని, త‌మ‌ను భ‌య‌పెట్టార‌ని, ప్ర‌లోభ పెట్టార‌ని, త‌మ‌ను పోటీ చేయ‌కుండా చేయ‌డానికి కుళ్ళు, కుతంత్రాలు జ‌రిపార‌ని… చివ‌రికి అభిమ‌న్యుడిగా భావించి ఎన్నిక‌ల్లో ప‌త్తా లేకుండా చేయాల‌ని చూశార‌ని వారి ఎత్తులు పార‌లేద‌ని ఆయ‌న వివ‌రించారు. తాను అభిమ‌న్యుడ్ని […]

మా కుటుంబానికి న‌వ్వులు పంచుతా: రాజేంద్ర‌ప్ర‌సాద్‌
X
తాను గెలవాల‌ని కోరుకున్న ప్ర‌తి తెలుగువాడి పాదాల‌కు న‌మ‌స్కారం చేస్తున్నాన‌ని సినీ హీరో, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేష‌న్ కొత్త అధ్య‌క్షుడు గ‌ద్దె రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. ఎన్నిక‌ల ప్ర‌క‌ట‌న వ‌చ్చిన త‌ర్వా త ఎన్నో ప‌రీక్ష‌లు త‌ట్టుకుని ఈ గెలుపు సాధించామ‌ని, త‌మ‌ను భ‌య‌పెట్టార‌ని, ప్ర‌లోభ పెట్టార‌ని, త‌మ‌ను పోటీ చేయ‌కుండా చేయ‌డానికి కుళ్ళు, కుతంత్రాలు జ‌రిపార‌ని… చివ‌రికి అభిమ‌న్యుడిగా భావించి ఎన్నిక‌ల్లో ప‌త్తా లేకుండా చేయాల‌ని చూశార‌ని వారి ఎత్తులు పార‌లేద‌ని ఆయ‌న వివ‌రించారు. తాను అభిమ‌న్యుడ్ని కాద‌ని… న‌ట కిరీటీని అంటే అర్జునుడిన‌ని వారు తెలుసుకోలేకపోయార‌ని ఆయ‌న అన్నారు. భ‌య‌ప‌డితే మ‌నుగ‌డ లేదంటూ త‌న‌కు ఎంతో అండ‌గా నిలిచిన సినీ న‌టుడు నాగ‌బాబు ఇచ్చిన మ‌ద్ద‌తు అంతాఇంతా కాద‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు. మా అధ్య‌క్షుడిగా ఉన్నంత‌కాలం తాను స‌న్నాఫ్ స‌త్య‌మూర్తిగానే ఉంటానని, తన‌ను ఎంత‌గానో అభిమానించే క‌ళాకారుల ప్రేమ‌ని, త‌న ప్రాణాన్ని ప‌ణంగా పెట్టి క‌ళాకారుల‌కు సేవ చేస్తూనే ఉంటానని, ఇందుకు తాను 24 గంట‌లూ అందుబాటులోనే ఉంటాన‌ని ప్ర‌క‌టించారు. ఒక‌టి రెండు ఓట్ల‌తో గెలిచినా గెలిచిన‌ట్టేన‌ని, కాని త‌న‌కు వ‌చ్చిన 85 మెజారిటీ చూస్తే అది నాపై అభిమానం కాద‌ని, త‌న‌ను ప‌ని చేయ‌మ‌ని ఎక్కువ మంది కోరుకుంటున్న‌ట్టుగా తాను భావిస్తాన‌ని ఆయ‌న అన్నారు. తాను ఏ హామీలు ఇచ్చానో వాటిని తూ.చ‌. త‌ప్ప‌కుండా అమ‌లు చేస్తాన‌ని, తాను అధ్య‌క్ష‌డిగా ఉన్నంత కాలం మా కార్యాల‌యంలో టీ కూడా తాగ‌న‌ని అన్నారు. త‌న‌కు న‌వ్వించ‌డం దేవుడిచ్చిన వ‌రం అని… ఈ న‌వ్వుల్ని ఇక మా లో ఉన్న అంద‌రికీ పంచాల‌న్న‌ది త‌న ల‌క్ష్య‌మ‌ని రాజేంద్ర‌ప్ర‌సాద్ అన్నారు.-పీఆర్‌
First Published:  17 April 2015 11:51 AM IST
Next Story