సన్‌టీవీ నుంచి నటి సుకన్యకు రూ.10 లక్షల పరిహారం
చెన్నై: సన్‌టీవిపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో ప్రముఖ తమిళ సినీ నటి సుకన్య 20 యేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత విజయం సాధించారు. నటి సుకన్యకు రూ.10 లక్షలను చెల్లించాలని సిటీ సివిల్ కోర్టు సన్‌టీవీ యాజమాన్యాన్ని ఆదేశించింది. 20 యేళ్లకు ముందు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అడవిలో ఇచ్చిన ఇంటర్వ్యూను సన్‌టీవీ ప్రసారం చేసింది. ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్ నటి సుకన్యను కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో సుకన్య […]
BY Pragnadhar Reddy17 April 2015 9:43 AM IST
Pragnadhar Reddy Updated On: 19 April 2015 9:47 AM IST
చెన్నై: సన్‌టీవిపై దాఖలు చేసిన పరువునష్టం దావా కేసులో ప్రముఖ తమిళ సినీ నటి సుకన్య 20 యేళ్ల సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత విజయం సాధించారు. నటి సుకన్యకు రూ.10 లక్షలను చెల్లించాలని సిటీ సివిల్ కోర్టు సన్‌టీవీ యాజమాన్యాన్ని ఆదేశించింది. 20 యేళ్లకు ముందు గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ అడవిలో ఇచ్చిన ఇంటర్వ్యూను సన్‌టీవీ ప్రసారం చేసింది. ఆ ఇంటర్వ్యూలో వీరప్పన్ నటి సుకన్యను కించపరిచే విధంగా కొన్ని వ్యాఖ్యలు చేశాడు. దీంతో సుకన్య సన్‌టీవి, తమిళ పత్రిక నక్కీరన్‌పై పరువు నష్టం దావా వేశారు. ఆ కేసు పలు కోర్టులకు బదిలీ అయి చివరగా 15వ అదనపు సిటీ సివిల్ కోర్టులో విచారణకు వచ్చింది. ఈ కేసుపై విచారణ జరిపిన న్యాయమూర్తి చంద్రశేఖర్ తీర్పు చెబుతూ… నటి సుకన్యకు సన్‌టీవీ యాజమాన్యం రూ.10,00,500లను పరిహారంగా చెల్లించాలని ఆదేశించారు. ఈ కేసు నుండి నక్కీరన్ పత్రిక సంపాదకుడు గోపాల్‌ను తొలగించారు. వీరప్పన్ ఇంటర్వ్యూ ప్రసారంపై పూర్తి హక్కులు సన్ టీవీవీ కనుక ఆయనను నిందితుడిగా చేర్చనవసరం లేదని న్యాయమూర్తి ఈ సందర్భంగా అభిప్రాయపడ్డారు.
Next Story