Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 54

చలి – చావు ఇద్దరు మనుషులు స్వర్గంలో కలుసుకున్నారు. ‘నువ్వెందుకు చనిపోయావు?’ అని మొదటి అతను అడిగాడు. రెండో అతను ‘విపరీతమైన చలి వల్ల’ అన్నాడు. ‘మరి నువ్వెలా చనిపోయావు’ అని అడిగా రెండో వాడు. ‘నేను వేరే వూరి నుంచి ఒక రోజు మా ఇంటికి వచ్చాను. నా భార్య ఎవరో పర పురుషుడితో మాట్లాడుతూ ఉన్నట్లు సందేహం కలిగింది. ఇంట్లో ప్రతి మూలా వెతికాను. ఎవరూ కనిపించలేదు. దాంతో పశ్చాత్తాపంతో గుండె ఆగి చనిపోయాను’ […]

చలి – చావు

ఇద్దరు మనుషులు స్వర్గంలో కలుసుకున్నారు.
‘నువ్వెందుకు చనిపోయావు?’ అని మొదటి అతను అడిగాడు. రెండో అతను ‘విపరీతమైన చలి వల్ల’ అన్నాడు. ‘మరి నువ్వెలా చనిపోయావు’ అని అడిగా రెండో వాడు. ‘నేను వేరే వూరి నుంచి ఒక రోజు మా ఇంటికి వచ్చాను. నా భార్య ఎవరో పర పురుషుడితో మాట్లాడుతూ ఉన్నట్లు సందేహం కలిగింది. ఇంట్లో ప్రతి మూలా వెతికాను. ఎవరూ కనిపించలేదు. దాంతో పశ్చాత్తాపంతో గుండె ఆగి చనిపోయాను’ అన్నాడు.
అదంతా విని రెండో అతను ‘నువ్వుగానీ ఫ్రిజ్‌ ఓపెన్‌ చేసి ఉంటే ఇద్దరం బతికి ఉండేవాళ్లం కదా!’ అనే సరికి మొదటి వాడు కళ్లు తేలేశాడు.

లేటు

శ్రీమతి కళ : మా ఆయన ప్రతిరోజూ పొద్దున్నే నన్ను కొడతారు.
శ్రీమతి పరిమళ : అయ్యో పాపం! ఎందుకని.
శ్రీమతి కళ : మా ఆయన పొద్దున్నే ఏడు గంటలకు నిద్రలేస్తారు. నేను ఎనిమిది గంటలకు లేస్తాను. నన్ను గంటసేపు కొట్టిలేపుతారు.

నీళ్ల కింద

సంజు : నేను నీళ్ళ కింద పది నిముషాలు ఉండగల్ను.
మంజు : అసాధ్యం! జరిగే పనికాదు
సంజు : ఒక గ్లాసులో నీళ్ళు తీసుకుని ఈ నీళ్ళ గ్లాసును తలపై పెట్టుకుని పది నిముషాలు నిలబడ్డాడు.

First Published:  17 April 2015 12:33 AM IST
Next Story