ఇక హుస్సేన్ సాగర్ చుట్టూ వైఫై సేవలు
హైదరాబాద్: మరికొద్ది సేపట్లో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వైఫై సేవలను అందుబాటులోకి తెస్తుంది తెలంగాణ సర్కార్. ఈ సేవలను తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కె. తారక రామారావు ప్రారంభించనున్నారు. తొలి 30 నిమషాల వరకు ఎవరైనా ఈ వైఫై సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత వాడుకునే వారు ప్యాకేజీని బట్టి రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వైఫై సేవలు కావాలనుకునే వారు ముందుగా వారివారి ఖాతాలను ఐ.టి.శాఖ వద్ద నమోదు చేసుకోవలసి […]
BY Pragnadhar Reddy16 April 2015 10:47 AM IST
X
Pragnadhar Reddy Updated On: 16 April 2015 10:47 AM IST
హైదరాబాద్: మరికొద్ది సేపట్లో హైదరాబాద్ హుస్సేన్ సాగర్ చుట్టూ పది కిలోమీటర్ల పరిధిలో వైఫై సేవలను అందుబాటులోకి తెస్తుంది తెలంగాణ సర్కార్. ఈ సేవలను తెలంగాణ ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి కె. తారక రామారావు ప్రారంభించనున్నారు. తొలి 30 నిమషాల వరకు ఎవరైనా ఈ వైఫై సేవలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చు. ఆ తర్వాత వాడుకునే వారు ప్యాకేజీని బట్టి రుసుం చెల్లించాల్సి ఉంటుంది. వైఫై సేవలు కావాలనుకునే వారు ముందుగా వారివారి ఖాతాలను ఐ.టి.శాఖ వద్ద నమోదు చేసుకోవలసి ఉంటుంది. కాగా మరోవైపు తెలంగాణ ప్రభుత్వం త్వరలో హైదరాబాద్‌లోని మిగిలిన ప్రధాన కూడళ్ళలో కూడా ఇంటర్నెట్ వైఫై సేవలు అందుబాటులోకి తీసుకురానుంది. ఒకేసారి 1850 మంది నుంచి 2500 మంది వరకు ఈ వైఫై సేవలను ఉపయోగించుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు.
వైఫై సేవలకు ఏపీలో ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్
దేశంలో అతి చౌకైన, వేగవంతమైన వైఫై సేవలను గ్రామీణ ప్రాంతాల్లో అందించాలని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ నిర్ణయించింది. ఇందుకోసం ఫైబర్‌గ్రిడ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతోంది. ఇప్పటివరకూ.. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఫైబర్ ఆప్టిక్ విధానం ద్వారా వైఫై సేవలను అందిస్తున్నారు. దీంతో ఎక్కడైనా ఓ చోట వైరుతెగితే.. ఇంటర్నెట్ సేవలు ఆగిపోతున్నాయి. భవిష్యత్‌లో ఇలాంటి అవరోధాలు ఎదురుకాకుండా ఉండేందుకు వీలుగా మల్టీ లైన్ విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ భావిస్తోంది.-పీఆర్
Next Story