హర్డ్ వర్క్ చేస్తేనే వచ్చింది..!
శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ ఏర్పరచిన బేస్ తోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ ఎంత వరకు వర్క్ చేస్తుంది ? మహా అయితే ఫస్ట్ సినిమా లాంచింగ్ వరకు పని చేస్తుంది. ధియేటర్ కు కొంత క్రౌడ్ పుల్ చేయడానికి వర్కువుట్ అవుతుంది. ఆ తరువాత ఇండస్ట్రీలో నిలబడాలంటే కచ్చితంగా వ్యక్తిగతంగా టాలెంట్ వుండాల్సిందే. శృతిహాసన్ మొదటి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. కానీ.. ఆ తరువవాత తను నటించిన […]
శృతి హాసన్ తన తండ్రి కమల్ హాసన్ ఏర్పరచిన బేస్ తోనే హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. బ్యాక్ గ్రౌండ్ ఎంత వరకు వర్క్ చేస్తుంది ? మహా అయితే ఫస్ట్ సినిమా లాంచింగ్ వరకు పని చేస్తుంది. ధియేటర్ కు కొంత క్రౌడ్ పుల్ చేయడానికి వర్కువుట్ అవుతుంది. ఆ తరువాత ఇండస్ట్రీలో నిలబడాలంటే కచ్చితంగా వ్యక్తిగతంగా టాలెంట్ వుండాల్సిందే. శృతిహాసన్ మొదటి చిత్రంతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.. కానీ.. ఆ తరువవాత తను నటించిన చిత్రాలన్ని ఫెయిల్ కావడంతో.. ఐరన్ లెగ్ అనే పేరు తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ తో నటించిన గబ్బర్ సింగ్ సూపర్ హిట్ కావడంతో శృతిహాసన్ కు గుడ్ టైమ్ ప్రారంభం అయ్యింది. ఒక హిట్ పది ఫెయిల్యూర్స్ ను కవర్ చేయడం అంటే కచ్చితంగా ఇదే మరి.
ఇక నటిగా తను ప్రస్తుత స్థితికి చేరడం వెనక అంకిత భావంతో పని చేయడమే అని తెలిపింది. హిందిలో అక్షయ్ కుమార్ సరసన మన టాలీవుడ్ డైరెక్టర్ క్రిష్ చేసిన గబ్బర్ ఈజ్ బ్యాక్ చిత్రంలో నటించింది. ఈ చిత్రం మే 1న ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కు సిద్దం అవుతుంది. ఇక సౌత్ టాలెంటెడ్ డైరెక్టర మురగదాస్ హిందిలో హృతిక్ రోషన్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ ఛాన్స్ శృతిహాసన్ కే రావోచ్చు అనే టాక్ వినిపిస్తుంది. టాలెంట్ తో పాటు ..ఇండస్ట్రీలో సక్సెస్ వుంటేనే లైమ్ లైట్ లో ఉండేది ఎవరైన అని చెప్పడమే శృతి ఉద్దేశ్యం కాబోలు. కరెక్టే కదా.!