శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఏపీకి మరో ఎదురుదెబ్బ!
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. మృతుడు శశికుమార్ దేహానికి రీ-పోస్టుమార్టం చేయాలన్న ఆయన కుటుంబసభ్యుల పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం అనుకూలంగా స్పందించింది. శశికుమార్ మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. ఈ పోస్టుమార్టం చెన్నైలో నిర్వహించాలని, ఇందుకు నిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు వైద్యుల్ని పంపించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకయ్యే ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలని సూచించింది. అవసరమనుకుంటే ఏపీ ప్రభుత్వం కూడా తమ తరఫున వైద్యుల్ని పంపించుకోవచ్చని తెలిపింది. శశికుమార్ తరఫున వచ్చినట్టే […]
BY Pragnadhar Reddy16 April 2015 11:04 AM IST
Pragnadhar Reddy Updated On: 16 April 2015 11:07 AM IST
శేషాచలం ఎన్‌కౌంటర్‌పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మరో ఎదురుదెబ్బ తగిలింది. మృతుడు శశికుమార్ దేహానికి రీ-పోస్టుమార్టం చేయాలన్న ఆయన కుటుంబసభ్యుల పిటిషన్‌పై ఉన్నత న్యాయస్థానం అనుకూలంగా స్పందించింది. శశికుమార్ మృతదేహానికి రీ-పోస్టుమార్టం చేయాలని ఆదేశించింది. ఈ పోస్టుమార్టం చెన్నైలో నిర్వహించాలని, ఇందుకు నిమ్స్ ఆస్పత్రి నుంచి ముగ్గురు వైద్యుల్ని పంపించాలని కోర్టు ఆదేశించింది. ఇందుకయ్యే ఖర్చులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భరించాలని సూచించింది. అవసరమనుకుంటే ఏపీ ప్రభుత్వం కూడా తమ తరఫున వైద్యుల్ని పంపించుకోవచ్చని తెలిపింది. శశికుమార్ తరఫున వచ్చినట్టే మిగతా మృతుల కుటుంబసభ్యులు వస్తే వారి పిటిషన్‌లను కూడా స్వీకరించే అంశాన్ని కోర్టు పరిశీలిస్తుందని పేర్కొంది. శనివారంలోగా రీ-పోస్టుమార్టం నివేదిక ఇవ్వాలని, దీన్ని సీల్డ్ కవర్‌లో తమకు మాత్రమే అందజేయాలని న్యాయస్థానం ఆదేశించింది. శశికుమార్ రీ-పోస్టుమార్టం పూర్తయిన తర్వాత ఆ మృతదేహంతో శవ యాత్రలు, ర్యాలీలు చేయకూడదని పిటిషనర్లను ఆదేశించింది.-పీఆర్
Next Story