బెదిరింపులకు దిగిన ఏపీ ప్రభుత్వం
అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి పూనుకున్న ప్రభుత్వం భూముల సమీకరణకు బెదిరింపులను ఆయుధంగా చేపట్టింది. గడువు లోపల అంటే ఈ నెల 30వ తేదీలోపు భూములు ఇచ్చిన వారికే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు వర్తిస్తాయని, తర్వాత భూములు ఇచ్చిన వారు ప్రయోజనాలేమీ పొందలేరని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం 75 నెంబర్ జీవోను జారీ చేసింది. ఇది ఒక రకంగా రైతులను బెదిరింపులకు గురి చేయడమేనని అన్నదాతలు విమర్శిస్తున్నారు. రైతులందరూ స్వచ్ఛందంగా భూములిస్తున్నారని చెప్పిన ప్రభుత్వం… అదే […]
అమరావతి పేరుతో రాజధాని నిర్మాణానికి పూనుకున్న ప్రభుత్వం భూముల సమీకరణకు బెదిరింపులను ఆయుధంగా చేపట్టింది. గడువు లోపల అంటే ఈ నెల 30వ తేదీలోపు భూములు ఇచ్చిన వారికే ప్రభుత్వం ప్రకటించిన ప్యాకేజీలు వర్తిస్తాయని, తర్వాత భూములు ఇచ్చిన వారు ప్రయోజనాలేమీ పొందలేరని పేర్కొంది. ఈ మేరకు ప్రభుత్వం 75 నెంబర్ జీవోను జారీ చేసింది. ఇది ఒక రకంగా రైతులను బెదిరింపులకు గురి చేయడమేనని అన్నదాతలు విమర్శిస్తున్నారు. రైతులందరూ స్వచ్ఛందంగా భూములిస్తున్నారని చెప్పిన ప్రభుత్వం… అదే నిజమైతే ఈ జీవో ఎందుకు విడుదల చేయాల్సి వచ్చిందో చెప్పాలని వారు డిమాండు చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం బ్లాక్ మెయిల్ రాజకీయాలను మానుకోవాలని వారు డిమాండు చేశారు.-పీఆర్