రూ.65 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత
ఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.65 కోట్ల విలువైన కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు ఈ కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కోకైన్ పట్టుబడడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. అసలు ఇంత మొత్తంలో కొకైన్‌ను తరలించడం అధికారులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని వెనుక ఎవరున్నారనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు […]
BY Pragnadhar Reddy15 April 2015 6:58 AM IST
X
Pragnadhar Reddy Updated On: 15 April 2015 12:28 PM IST
ఢిల్లీ: ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో రూ.65 కోట్ల విలువైన కొకైన్‌ను కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ప్రయాణికుల తనిఖీల్లో భాగంగా దుబాయ్ నుంచి వచ్చిన వ్యక్తి నుంచి కస్టమ్స్ అధికారులు ఈ కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఇంత పెద్ద మొత్తంలో కోకైన్ పట్టుబడడం ఇటీవల కాలంలో ఇదే తొలిసారి. అసలు ఇంత మొత్తంలో కొకైన్‌ను తరలించడం అధికారులకు కూడా ఆశ్చర్యం కలిగిస్తుంది. దీని వెనుక ఎవరున్నారనే కోణంలో కూడా అధికారులు దర్యాప్తు జరుపుతున్నారు.-పీఆర్
Next Story