జర నవ్వండి ప్లీజ్ 50
వంట ‘నేను ఐదేళ్ళ నించీ వంట చేస్తున్నాను’ ‘అయ్యో ఇంకా పూర్తి కాలేదా?’ ఈత వాసు: నువ్వు ఈత కొట్టడం ఎక్కడ నేర్చుకున్నావు? శీను : నీళ్ళలో! గాంధీ మాట ‘అప్పుడు గాంధీజీ నెహ్రూతో ఏమన్నారు?’ అని అడిగింది టీచర్. ‘నాకెలా తెలుస్తుందండీ! నేనప్పుడక్కడ లేను’. మొదటి కోరిక నారాయణ, అతని భార్య రోజూ కుక్కల్లా పొట్లాడుకునే వాళ్ళు. ఒకరోజు విపరీతంగా గొడవపడి విసిగిపోయి నారాయణ ఆకాశం కేసి చూసి ‘భగవంతుడా! నన్ను నీ దగ్గరకు తీసుకెళ్లిపో’ […]
వంట
‘నేను ఐదేళ్ళ నించీ వంట చేస్తున్నాను’
‘అయ్యో ఇంకా పూర్తి కాలేదా?’
ఈత
వాసు: నువ్వు ఈత కొట్టడం ఎక్కడ నేర్చుకున్నావు?
శీను : నీళ్ళలో!
గాంధీ మాట
‘అప్పుడు గాంధీజీ నెహ్రూతో ఏమన్నారు?’ అని అడిగింది టీచర్.
‘నాకెలా తెలుస్తుందండీ! నేనప్పుడక్కడ లేను’.
మొదటి కోరిక
నారాయణ, అతని భార్య రోజూ కుక్కల్లా పొట్లాడుకునే వాళ్ళు. ఒకరోజు విపరీతంగా గొడవపడి విసిగిపోయి నారాయణ ఆకాశం కేసి చూసి ‘భగవంతుడా! నన్ను నీ దగ్గరకు తీసుకెళ్లిపో’ అన్నాడు.
అతని భార్య కూడా ఆకాశంలోకి చూసి ‘దేవా! నన్ను కూడా నీ దగ్గరికి తీసుకెళ్లిపో’ అంది.
ఆమె ఆ మాటన్న వెంటనే నారాయణ ‘ప్రభూ! మొదట నా భార్య కోరికను మన్నించు’ అన్నాడు.