Telugu Global
Cinema & Entertainment

బన్నీ దున్నేస్తున్నాడు

           అల్లుఅర్జున్-త్రివిత్రమ్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. రిలీజైన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అధరహో అనే రేంజ్ లో ఉన్నాయి సత్యమూర్తి సినిమాకి. తాదాగా ఈ మూవీ మరో రికార్డు సొంతం చేసుకుంది. కేవలం 4 రోజుల వ్యవధిలో ప్రవంచవ్యాప్తంగా 30కోట్ల రూపాయల వసూళ్లు ఆర్జించి సినీపండితుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.             జులాయి […]

బన్నీ దున్నేస్తున్నాడు
X
అల్లుఅర్జున్-త్రివిత్రమ్ కాంబినేషన్ లో వచ్చిన తాజా చిత్రం సన్నాఫ్ సత్యమూర్తి. రిలీజైన మొదటి రోజు మిక్స్ డ్ టాక్ వచ్చినప్పటికీ కలెక్షన్లు మాత్రం అధరహో అనే రేంజ్ లో ఉన్నాయి సత్యమూర్తి సినిమాకి. తాదాగా ఈ మూవీ మరో రికార్డు సొంతం చేసుకుంది. కేవలం 4 రోజుల వ్యవధిలో ప్రవంచవ్యాప్తంగా 30కోట్ల రూపాయల వసూళ్లు ఆర్జించి సినీపండితుల్ని ఆశ్చర్యానికి గురిచేసింది.
జులాయి తర్వాత బన్నీ-త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన బడా మూవీ సన్నాఫ్ సత్యమూర్తి. ఈ సినిమా విడుదలకు ముందు త్రివిక్రమ్ అత్తారింటికి దారేది సినిమాతో చరిత్ర సృష్టించాడు. అటు బన్నీ రేసుగుర్రంతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. దీంతో సన్నాఫ్ సత్యమూర్తిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. సినిమా విడుదలైన తర్వాత అక్కడక్కడ నెగెటివ్ టాక్ వచ్చినప్పటికీ.. ఈ హైప్ మాత్రం వసూళ్లకు బాగా కలిసొచ్చింది. అందుకే సన్నాఫ్ సత్యమూర్తి సినిమా వసూళ్లతో రాకెట్ లా దూసుకుపోతోంది.
ఇప్పటికే ఓవర్సీస్ లో ఒక మిలియన్ డాలర్ మూవీగా అవతరించింది సత్యమూర్తి సినిమా. ఈ వీకెండ్ కు 3 సినిమాలు రిలీజ్ అవుతున్నప్పటికీ అందులో పెద్దగా స్టార్ ఎట్రాక్షన్ లేకపోవడం సన్నాఫ్ సత్యమూర్తికి బాగా కలిసొచ్చే అంశం. కాబట్టి ఈ వీకెండ్ కూడా సత్యమూర్తి బాగా ఆడితే ఓవరాల్ గా వసూళ్ల పరంగా సినిమా హిట్టయినట్టే. మరోవైపు ప్రచారం కూడా భారీ స్థాయిలో చేస్తున్నారు కాబట్టి మరో 4 రోజుల్లో సత్యమూర్తి సేఫ్ జోన్ లోకి ఎంటరైపోవడం ఖాయం.
First Published:  14 April 2015 2:00 PM IST
Next Story