ఓ యంగ్ హీరోతో కత్రీనా కైఫ్..
హీరోయిన్ గా సీనియార్టి పెరుగుతున్న కొద్ది గ్లామర్ సీటు కు దూరం అవుతున్నట్లే. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ఇదే బాటలో వున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి సీనియర్స్ తో నటించిన కత్రీనా.. తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో మూడో సినిమా చేస్తుంది. గత యేడాది పితూరి అనే సినిమా చేసింది. తాజాగా ఒక లేడి డైరెక్టర్ తో మంచి లవ్ స్టొరి […]
BY Pragnadhar Reddy14 April 2015 7:45 AM IST
X
Pragnadhar Reddy Updated On: 14 April 2015 12:17 PM IST
హీరోయిన్ గా సీనియార్టి పెరుగుతున్న కొద్ది గ్లామర్ సీటు కు దూరం అవుతున్నట్లే. ప్రస్తుతం బాలీవుడ్ హీరోయిన్ కత్రీనా కైఫ్ ఇదే బాటలో వున్నారు. ప్రస్తుతం సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, అక్షయ్ కుమార్ వంటి సీనియర్స్ తో నటించిన కత్రీనా.. తన బాయ్ ఫ్రెండ్ రణబీర్ కపూర్ తో మూడో సినిమా చేస్తుంది. గత యేడాది పితూరి అనే సినిమా చేసింది. తాజాగా ఒక లేడి డైరెక్టర్ తో మంచి లవ్ స్టొరి లో నటించ బోతుంది. ఈ చిత్రంలో యువ మీరో సిద్దార్ధ మల్లొత్ర చేస్తున్నాడు.
ఏజ్ ముదిరిన హీరోయిన్స్ కుర్ర హీరోలతో చేయడానికి ఆసక్తి చూపుతారు. అలాగే సీనియర్ హీరోస్ కుర్ర హీరోయిన్స్ తో చేస్తుంటారు. అయితే స్టార్ హీరోయినైనా కత్రీనా కైఫ్ .. కొత్త హీరోలతో నటించడం అంటే దాని వెనక పెద్ద రీజనే వుంటుంది. తాజాగా నిత్యా మోహ్ర అనే దర్శకురాలతో సినిమా చేయడానికి కైట్స్ అంగీకరించడానికి ఒక స్ట్రాంగ్ రీజన్ లేకపోలేదు మరి. బాలీవుడ్ లో ఓ పెద్ద నిర్మాణ సంస్థ ఈ కొత్త దర్శకురాలి వెనక ఉందనే టాక్ వినిపిస్తుంది. మొత్తం మీద మంచి ప్రేమ కథ చిత్రంతో కత్రీనా ఈయేడాది అలరించనుందన్నమాట.
Next Story