Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 49

సెల్ఫ్‌ సర్వీసు ఒక పార్టీ జరుగుతోంది. ఆ పార్టీలో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఉన్నారు. అక్కడంతా సెల్ఫ్‌ సర్వీసు. అందుకని ఒక ఆఫీసర్‌ ప్లేట్‌లో చికెన్‌ తుందూరీ పెట్టుకుని ఆవురావురంటూ తింటున్నాడు. అదంతా చూసిన నెహ్రూగారు ఆ ఆఫీసరు భుజం తట్టి ‘మెల్లగా, నెమ్మదిగా తిను. ఆ కోడి చచ్చిపోయిందిగా! ఎక్కడికీ పారిపోదులే’ అన్నాడు. ************ పోట్లాట ఎప్పట్లాగే ఆ రోజు కూడా భార్యాభర్తలు బాగా పోట్లాడుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడ్డం మానేశారు. అయితే భర్త మరుసటి […]

సెల్ఫ్‌ సర్వీసు

ఒక పార్టీ జరుగుతోంది. ఆ పార్టీలో జవహర్‌లాల్‌ నెహ్రూ కూడా ఉన్నారు. అక్కడంతా సెల్ఫ్‌ సర్వీసు. అందుకని ఒక ఆఫీసర్‌ ప్లేట్‌లో చికెన్‌ తుందూరీ పెట్టుకుని ఆవురావురంటూ తింటున్నాడు. అదంతా చూసిన నెహ్రూగారు ఆ ఆఫీసరు భుజం తట్టి ‘మెల్లగా, నెమ్మదిగా తిను. ఆ కోడి చచ్చిపోయిందిగా! ఎక్కడికీ పారిపోదులే’ అన్నాడు.

************

పోట్లాట

ఎప్పట్లాగే ఆ రోజు కూడా భార్యాభర్తలు బాగా పోట్లాడుకున్నారు. ఒకరితో ఒకరు మాట్లాడ్డం మానేశారు. అయితే భర్త మరుసటి రోజు పొద్దున్నే వాళ్ల ఆఫీసర్ని కలవాల్సి ఉంది. అంటే పొద్దున్నే ముందుగా లేవాలి. భార్యతో మాటల్లేవు కాబట్టి ‘నన్ను పొద్దున్నే ఆరుగంటలకు లేపు’ అని పేపర్‌ మీద రాసి భార్య దిండు కింద పెట్టాడు.కాన్ని పొద్దున్నే అతడు లేచే సరికి ఏడుగంటలైంది. టైం చూసి కోపంగా భార్య వైపు చూశాడు. భార్య దిండు చూపింది. ‘ఉదయం ఆరు గంటలైంది, లేవండి’ అని పేపర్‌ మీద రాసుంది.

************

సాహసం

ఒక నది ఆనకట్టపై జనాలు గుంపుగా ఉన్నారు. ఉన్నట్లుండి ఒకావిడ చేతిలోని పసిపాప జారి నదిలో పడిపోయింది. తల్లి తల్లడిల్లిపోయింది. భోరున ఏడ్చింది. నదిలో దూకి పపిబిడ్డ ప్రాణాల్ని కాపాడటానికి ఎవరూ ప్రయత్నించలేదు. అంతలో ఒక ఆమెరికన్‌ టూరిస్ట్‌ నదిలో దూకి పాపను క్షేమంగా రక్షించాడు. టీవీ వాళ్లు అమెరికన్‌ టూరిస్టుని ఇంటర్వ్చూ చేయడానికి వచ్చారు. అతని సాహసం గురించి నాలుగు మాటలు మాట్లాడమన్నారు. అమెరికన్‌ టూరిస్టు ‘సాహసమా! వంకాయా! నన్ను వెనకనించి తోసిన వెధవ కనిపిస్తే గొంతు పిసికి చంపుతాను’ అన్నాడు.

************

25 గంటల పని

పనీపాట లేని ఇద్దరు ప్రభుత్వోద్యోగులు ఇలా మాట్లాడుకుంటున్నారు.
రాజు : నేను రోజుకి 25 గంటలు పనిచేస్తాను
సుబ్బారావు : అదెలా సాధ్యం?
రాజు : అందుకే రోజూ ఒక గంట ముందే నిద్రలేస్తాను.

First Published:  14 April 2015 8:00 AM
Next Story