Telugu Global
Cinema & Entertainment

ఎన్టీఆర్ సినిమాలో జగపతిబాబు

             టెంపర్ సినిమా వేడి తగ్గడంతో నెక్ట్స్ మూవీ పనిలో బిజీ అయ్యాడు ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమౌతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ ను ఇప్పటికే హీరోయన్ గా సెలక్ట్ చేసుకున్నారు. ఇప్పుడీ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా జోడించారు మేకర్స్. అదే జగపతిబాబు. అవును.. ఒకప్పటి హీరో, తాజా విలన్ జగపతిబాబు ఎన్టీఆర్ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ […]

ఎన్టీఆర్ సినిమాలో జగపతిబాబు
X
టెంపర్ సినిమా వేడి తగ్గడంతో నెక్ట్స్ మూవీ పనిలో బిజీ అయ్యాడు ఎన్టీఆర్. సుకుమార్ దర్శకత్వంలో త్వరలోనే సెట్స్ పైకి వెళ్లడానికి సిద్ధమౌతున్నాడు. రకుల్ ప్రీత్ సింగ్ ను ఇప్పటికే హీరోయన్ గా సెలక్ట్ చేసుకున్నారు. ఇప్పుడీ సినిమాకి మరో స్పెషల్ ఎట్రాక్షన్ కూడా జోడించారు మేకర్స్. అదే జగపతిబాబు. అవును.. ఒకప్పటి హీరో, తాజా విలన్ జగపతిబాబు ఎన్టీఆర్ మూవీలో ప్రతినాయకుడిగా కనిపించబోతున్నాడు. ఈ విషయాన్ని సుకుమార్ కన్ ఫర్మ్ చేశాడు.
సుకుమార్ సినిమాల్లో హీరో-విలన్ క్యారెక్టరైజేషన్లు చాలా కొత్తగా ఉంటాయి. ఎన్టీఆర్ పాత్ర స్వభావం, గెటప్ పై ఇప్పటికే బోలెడంత చర్చ జరుగుతోంది ఇండస్ట్రీలో. ఇప్పుడీ జాబితాలోకి జగపతిబాబు కూడా చేరిపోయాడు. అదిరిపోయే క్యారెక్టరైజేషన్ తో జగపతిబాబును సుకుమార్ ఒప్పించాడని సమాచారం. అదే కనుక నిజమైతే ఎన్టీఆర్-జగపతి బాబు సినిమా హాట్ కేక్ అవుతుంది. మరోవైపు దేవిశ్రీప్రసాద్ కూడా తన ఫ్రెండ్ సుక్కూ కోసం కసితో ట్యూన్స్ సిద్ధం చేస్తున్నాడు. పైగా ఎన్టీఆర్-రకుల్ ది ఫ్రెష్ కాంబినేషన్ కూడా కావడంతో.. సినిమాపై అంచనాలు ఇప్పట్నుంచే ఊపందుకున్నాయి.
First Published:  14 April 2015 6:24 AM
Next Story