పార్టీలు... నాయకులు చెరో దారి!
శివసేన పార్లమెంట్ సభ్యుడు రౌత్, బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వంటి నాయకులు అధిక సంతానం కలిగిన ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేయమంటుండగా… జాతి మనుగడ సాగించాలంటే హిందువులంతా నలుగురేసి పిల్లల్ని కనాలని శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పిలుపు ఇచ్చారు. ముస్లింలను డామినెట్ చేయడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదన్నది స్వామిగౌడ్‌గారి ఉవాచ. వీరంతా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారే అయినప్పటికీ సెక్యులర్ అన్న పదానికి అర్ధాన్ని మరిచిపోయి నోటికొచ్చినట్టు […]
BY Pragnadhar Reddy14 April 2015 5:03 AM GMT
X
Pragnadhar Reddy Updated On: 14 April 2015 5:03 AM GMT
శివసేన పార్లమెంట్ సభ్యుడు రౌత్, బీజేపీ ఎంపీ సాక్షి మహారాజ్ వంటి నాయకులు అధిక సంతానం కలిగిన ముస్లింలకు ఓటు హక్కును రద్దు చేయమంటుండగా… జాతి మనుగడ సాగించాలంటే హిందువులంతా నలుగురేసి పిల్లల్ని కనాలని శాసన మండలి ఛైర్మన్ స్వామిగౌడ్ పిలుపు ఇచ్చారు. ముస్లింలను డామినెట్ చేయడానికి ఇంతకన్నా మంచి మార్గం లేదన్నది స్వామిగౌడ్‌గారి ఉవాచ. వీరంతా రాజ్యాంగం మీద ప్రమాణం చేసి పదవులు అలంకరించిన వారే అయినప్పటికీ సెక్యులర్ అన్న పదానికి అర్ధాన్ని మరిచిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నారనడానికి ఇంతకన్నా రుజువులు అక్కర్లేదు. కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీయే ప్రభుత్వం బీజేపీ, శివసేన ఎంపీల మాటలు వారి సొంత గొంతుకతో మాట్లాడినవని తప్పించుకుంటే… స్వామిగౌడ్ మాటలకు టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇంతవరకు నోరు మెదిపిన దాఖలాలు లేవు. అంటే దీనర్ధం వీరు చేసిన ప్రకటనలకు తమ తమ పార్టీల మద్దతుందని జనం అనుకోవాలా? మైనారిటీలకు ఇది చేస్తున్నాం… అది చేస్తున్నాం… అని చెప్పుకునే పార్టీలను జనం నమ్మాలంటే అవసరమైనప్పుడు సకాలంలో స్పందించాలి. సెక్యులర్ భావాలనేవి ప్రకటనలకు మాత్రమే పరిమితం కాకుండా చేతల్లో కూడా కనబరిచినప్పుడే పార్టీలను, నాయకులను జనం నమ్ముతారు… లేకుంటే సమయం కోసం వేచి చూస్తారు.-పీఆర్
Next Story