ఆవరించిన అల్పపీడన ద్రోణి-ఇంకా వర్షాలకు అవకాశం
మధ్యప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమెరున్ తీరం వరకు అప్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో 1.5 కిలోమీటర్ల ఎత్తు మేర ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని తెలియజేసింది. ఈ రెండింటి ప్రభావం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వడగళ్ళ వాన కురిసే అవకాశం కూడా ఉంది. ఇపుడున్న వాతావరణ […]
మధ్యప్రదేశ్, రాయలసీమ, కర్ణాటక, తమిళనాడు మీదుగా కొమెరున్ తీరం వరకు అప్పపీడన ద్రోణి ఏర్పడి ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ అల్పపీడన ప్రభావంతో 1.5 కిలోమీటర్ల ఎత్తు మేర ఉపరితల ద్రోణి ఆవరించి ఉందని తెలియజేసింది. ఈ రెండింటి ప్రభావం వల్ల దక్షిణ కోస్తా, రాయలసీమ భారీ వర్షాలకు అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణ, రాయలసీమ జిల్లాల్లో ఒకటి రెండు చోట్ల వడగళ్ళ వాన కురిసే అవకాశం కూడా ఉంది. ఇపుడున్న వాతావరణ పరిస్థితుల కారణంగా రేపు దక్షిణ కోస్తాలో పెనుగాలులు వీచే అవకాశం ఉంది. కాగా గత రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు రాయలసీమ రైతుల్ని కకావికలం చేశాయి. పంటలు నష్టపోయి లబోదిబో మంటున్నారు. తమ వద్దకు వచ్చే ప్రజా ప్రతినిధుల వద్ద తమ గోడు వెళ్లబోసుకుంటున్నారు. చిత్తూరు జిల్లాలో 500 హెక్టార్లలో పంట నష్టం జరిగింది. తొమ్మిది కోళ్ళ ఫారాలు కుప్పకూలిపోయాయి. పలమనేరు ప్రాంతంలో భారీ వృక్షాలు నేలకూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు పడిపోయాయి. కర్నూలు జిల్లాలో మామిడి చెట్లకు అపార నష్టం జరిగింది. పంట మీదున్న కాయలన్నీ రాలిపోయి రైతుకు నష్టాన్ని మిగిల్చింది. కడప జిల్లాలో వడగండ్ల వానకు బొప్పాయి చెట్లు విరిగిపోయాయి. కాయలు నేల మీద పడిపోయి ఎందుకు పనికి రాకుండా పోయాయి. అనంతపురం జిల్లాలో పొలంలో ఉన్న నీటిపారుదల పైపులు పగిలిపోయి రైతుకు నష్టాన్ని మిగిల్చాయి. వేల ఎకరాల్లో చినీ తోటలు నాశనం అయిపోయాయి. కాయలన్నీ కింద రాలిపోయి రైతులు కన్నీళ్ళ పర్యంతమవుతున్నారు. పంట పోలాలు చూడడానికి వచ్చిన మంత్రి పరిటాల సునీతకు రైతులు బోరున విలపిస్తూ తమ గోడు వెళ్ళబోసుకున్నారు. అధికారులు నష్టం అంచనా వేసిన తర్వాత పరిహారం అందజేస్తామని ఆమె భరోసా ఇస్తూ… వాస్తవికతకు అద్దం పట్టేట్టు నష్టం వివరాలతో నివేదికలు తయారు చేయాల్సిందిగా ఆమె అధికారులను ఆదేశించారు.
ఇక గుంటూరు, కృష్ణా, ఉభయ గోదావరి జిల్లాల్లో కూడా పంటలకు అపార నష్టం జరిగింది. దాదాపు లక్ష ఎకరాల్లో పంటలు నాశనమైపోయినట్టు చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు వెయ్యి ఎకరాల్లో ఉద్యాన పంటలు నాశనం అయిపోయాయి. కూరగాయల పంటలు ధ్వంసమై పోయాయి. ఏలూరు తడిసి ముద్దయ్యింది. తూర్పగోదావరి జిల్లాలో అంబాజీపేట రోడ్లన్నీ మునిగిపోయి జన సంచారానికి ఇబ్బందులేర్పడ్డాయి.
రాయలసీమ, కోస్తా ఆంధ్ర జిల్లాల్లో పడిన ఈ వర్షాలు అరటి, మామిడి, బొప్పాయి, వరి, వేరుశనగ, చినీ తోటలకు అపార నష్టాన్ని మిగిల్చాయి.-పీఆర్