త్వరలో జగన్ పార్టీలోకి బొత్స!
రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. దాదాపు రెండు, మూడు నెలల నుంచి ఈ పార్టీలో చేరడానికి బొత్స విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆహ్వానించేందుకు జగన్ కూడా సిద్ధంగా ఉన్నా ఉత్తరాంధ్ర నేతలు బొత్స రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక దశలో బొత్సను పార్టీలో చేర్చుకుంటే తాను వై.ఎస్.ఆర్.సి.పి. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సుజన కృష్ణ రంగారావు బెదిరించడంతో ఆయన రాకకు తాత్కాలిక అడ్డంకి ఏర్పడింది. అదే జిల్లాకు […]
రాష్ట్ర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి రంగం సిద్ధమైంది. దాదాపు రెండు, మూడు నెలల నుంచి ఈ పార్టీలో చేరడానికి బొత్స విశ్వప్రయత్నం చేస్తున్నారు. ఆహ్వానించేందుకు జగన్ కూడా సిద్ధంగా ఉన్నా ఉత్తరాంధ్ర నేతలు బొత్స రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఒక దశలో బొత్సను పార్టీలో చేర్చుకుంటే తాను వై.ఎస్.ఆర్.సి.పి. ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తానని సుజన కృష్ణ రంగారావు బెదిరించడంతో ఆయన రాకకు తాత్కాలిక అడ్డంకి ఏర్పడింది. అదే జిల్లాకు చెందిన మరో వై.ఎస్.ఆర్.సి.పి. నాయకుడు పెన్మత్స సాంబశివరావు కూడా బొత్స రాకను నిరసిస్తున్నారు.
అయితే మరో ఉత్తరాంధ్ర నాయకుడు ధర్మాన ప్రసాదరావు మాత్రం వీలైనంత ఎక్కువ మంది కాంగ్రెస్ నాయకుల్ని పార్టీలోకి చేర్చుకోవాలని పట్టు బడుతున్నారు. అయితే అధికారంలో ఉన్నప్పుడు వై.ఎస్. కుటుంబాన్ని అసెంబ్లీ సాక్షిగా నానా మాటలు అన్న బొత్సని పార్టీలో చేర్చుకోవడం ఏమిటి? పదవిలో ఉన్నప్పుడు వైకాపా నేతల మీద, కార్యకర్తల మీద అనేక కేసులు పెట్టి వేధించిన బొత్సని పార్టీలో ఎలా చేర్చుకుంటారని రాజశేఖరరెడ్డి అభిమానులు ప్రశ్నిస్తున్నారు.
రెండు, మూడు నెలల తర్జనభర్జన తర్వాత జగన్ ఒక అభిప్రాయానికి వచ్చినట్లు తెలిసింది. విజయనగరం జిల్లా పార్టీ నేతలకు, కార్యకర్తలకు ఇబ్బంది లేకుండా బొత్సకి విశాఖ జిల్లాను అప్పగించనున్నట్లు తెలిసింది. రానున్న స్థానిక ఎన్నికల భారం అంతా బొత్స భరించేలా ఒక అంగీకారం కుదిరినట్లు తెలుస్తోంది. అంతా అనుకున్నట్టు జరిగితే ఈ నెలలోనే బొత్స జగన్ పార్టీ పంచన చేరడం ఖాయం.