Telugu Global
NEWS

ఆర్టీసి పై బాదుడు.. విమానాలకు రాయితీ...

ఆర్టీసీ కోట్ల నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న‌ద‌న్న‌విష‌యం కొత్తేమీ కాదు. న‌ష్టాల ప‌ట్టాల  నుంచి లాభాల బాట ప‌ట్టించ‌డానికి రాయితీలు ఇవ్వాల్సింది పోయి ప‌న్నుల‌తో ప్ర‌భుత్వం బాదుడుకు సిద్ధమైంది. బస్సుల నిర్వహణలో అలవిమాలిన నిర్లక్ష్యం, ప్రైవేట్ బస్ ల జోరు, ప్రభుత్వం  పన్నుల మోత.. వ్యాట్ వాతలు.. ఇలా పలు అంశాలు ప్రగతి రథాన్ని తిరోగ‌మ‌న దిశ‌లో ప్ర‌యాణించేలా చేస్తున్నాయి.  ప్రజారవాణా వ్యవస్థకు ఊపిరులూదుతామన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి.. బడ్జెట్ కేటాయింపుల విషయానికొచ్చేసరికి మాత్రం ముఖం చాటేసి మిన్నకున్నారు. ఆర్టీసీ […]

ఆర్టీసి పై బాదుడు.. విమానాలకు రాయితీ...
X

ఆర్టీసీ కోట్ల నష్టాల్లో కొట్టుమిట్టాడుతున్న‌ద‌న్న‌విష‌యం కొత్తేమీ కాదు. న‌ష్టాల ప‌ట్టాల నుంచి లాభాల బాట ప‌ట్టించ‌డానికి రాయితీలు ఇవ్వాల్సింది పోయి ప‌న్నుల‌తో ప్ర‌భుత్వం బాదుడుకు సిద్ధమైంది. బస్సుల నిర్వహణలో అలవిమాలిన నిర్లక్ష్యం, ప్రైవేట్ బస్ ల జోరు, ప్రభుత్వం పన్నుల మోత.. వ్యాట్ వాతలు.. ఇలా పలు అంశాలు ప్రగతి రథాన్ని తిరోగ‌మ‌న దిశ‌లో ప్ర‌యాణించేలా చేస్తున్నాయి. ప్రజారవాణా వ్యవస్థకు ఊపిరులూదుతామన్న రాష్ట్ర ఆర్థిక మంత్రి.. బడ్జెట్ కేటాయింపుల విషయానికొచ్చేసరికి మాత్రం ముఖం చాటేసి మిన్నకున్నారు. ఆర్టీసీ నెలకు సుమారు రూ.4 కోట్ల వరకు నష్టాలు మూటగట్టుకుంటోంది. నెలకు 13 కోట్ల కిలోమీటర్ల మేర బస్ లు తిప్పితే వచ్చే రాబడి రూ.360 కోట్ల వరకు ఉంటోంది. ఆక్యుపెన్సీ రేషియో 70.57 శాతంగా ఉంది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీకి సంబంధించి ఈ ఏడాది జనవరి వరకు నష్టాలు రూ.537 కోట్లకు చేరాయి. ఇందులో కేవలం బస్సుల నిర్వహణ కారణంగా గడచిన పది నెలలకుగాను రూ.30 కోట్ల నష్టం సంస్థ ఈ విధంగా నష్టపోవడానికి కారణాలుగా కనిపిస్తున్నాయి. ప్రైవేట్ ట్రావెల్స్ స్టేజ్, కాంట్రాక్ట్ క్యారియర్ల పేరుతో బస్సుల్ని తిప్పుతూ ఆర్టీసీ ఆదాయానికి గండి కొడుతున్నాయి. వీటిని కట్టడి చేయాల్సిన ప్రభుత్వం, సంబంధిత అధికారులు అన్నీ తెలిసి కూడా మిన్నకుండిపోతున్నారనే ఆరోపణలున్నాయి. సంస్థ కొనుగోలు చేస్తున్న డీజిల్ పై వ్యాట్ 22.25 శాతంగా ప్రభుత్వం వసూలు చేస్తోంది. ఇదే రైల్వేలకు 4 శాతంగా ఉంది. విమానాలకు వాడే ఇంధనంపై వ్యాట్ ను ఒక శాతం మాత్రమే వసూలు చేసేలా ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆర్టీసీ కొనుగోలు చేసే విడిభాగాలపై కూడా 14.5 శాతం పన్ను విధిస్తున్నారు. పన్నులు, ఇంధనంపై వ్యాట్ తగ్గించాలని యాజమాన్యం ఎన్నిసార్లు మొత్తుకున్నా ప్రయోజనం లేకుండా పోతోంది. ఫలితంగా అభివృద్ధి దిశగా ఉరుకులెత్తాల్సిన ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలు అధోగతి దిశగా పరుగులు పెడుతున్నాయి. అంతేకాకుండా రాష్ట్ర బడ్జెట్ కేటాయింపుల్లో మొండి చెయ్యి చూపారే తప్ప ఆదుకునేందుకు పాలకులు ఏ మాత్రం ముందుకురాకపోవడం శోచనీయం.

First Published:  14 April 2015 11:55 AM IST
Next Story