Telugu Global
International

భార‌త్ వైపే ప్ర‌పంచ దేశాల చూపు: మోడీ

ప్ర‌పంచంలోని అన్ని దేశాలు ఇపుడు భార‌త్ వైపు చూస్తున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి అన్నారు. జ‌ర్మ‌నీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న సోమ‌వారం హోన్నోవ‌ర్‌లో అంత‌ర్జాతీయ ఎగ్జిబిష‌న్‌లో పాల్గొన్నారు. అక్క‌డ భార‌తీయ స్టాళ్ళ‌ను ప్రారంభిస్తూ… భార‌త్ త‌యారీ రంగ కేంద్రంగా మారుతుంద‌ని, అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌ర‌లి రావాల‌ని పిలుపు ఇచ్చారు. ప్ర‌జాస్వామ్యం, జ‌నాభా, డిమాండు భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్ర‌తి ఒక్క‌రికీ కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయ‌ని మోడీ తెలిపారు. ఈ అంత‌ర్జాతీయ ఫెస్టివ‌ల్‌కు భార‌త్‌ను భాగ‌స్వామ్య దేశంగా ఎంపిక […]

భార‌త్ వైపే ప్ర‌పంచ దేశాల చూపు: మోడీ
X

ప్ర‌పంచంలోని అన్ని దేశాలు ఇపుడు భార‌త్ వైపు చూస్తున్నాయ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడి అన్నారు. జ‌ర్మ‌నీ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న ఆయ‌న సోమ‌వారం హోన్నోవ‌ర్‌లో అంత‌ర్జాతీయ ఎగ్జిబిష‌న్‌లో పాల్గొన్నారు. అక్క‌డ భార‌తీయ స్టాళ్ళ‌ను ప్రారంభిస్తూ… భార‌త్ త‌యారీ రంగ కేంద్రంగా మారుతుంద‌ని, అక్క‌డ పెట్టుబ‌డులు పెట్టేందుకు త‌ర‌లి రావాల‌ని పిలుపు ఇచ్చారు. ప్ర‌జాస్వామ్యం, జ‌నాభా, డిమాండు భార‌త్‌లో పెట్టుబ‌డులు పెట్ట‌డానికి ప్ర‌తి ఒక్క‌రికీ కార‌ణాలుగా క‌నిపిస్తున్నాయ‌ని మోడీ తెలిపారు. ఈ అంత‌ర్జాతీయ ఫెస్టివ‌ల్‌కు భార‌త్‌ను భాగ‌స్వామ్య దేశంగా ఎంపిక చేసినందుకు జ‌ర్మ‌నీ ప్ర‌భుత్వానికి మోడీ కృత‌జ్ఞ‌త‌లు చెప్పారు. భార‌త ప్ర‌ధాని వెంట జ‌ర్మ‌నీ ఛాన్స‌ల‌ర్ ఏంజెలా మోర్క‌ర్ ఉన్నారు. .-పీఆర్‌

First Published:  13 April 2015 9:23 AM IST
Next Story