Telugu Global
NEWS

మోడీ అంత‌మే మా పంతం: సిమీ

గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగానే న‌రేంద్ర‌మోడిని అంతం చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల అది సాధ్యం కాలేద‌ని స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆప్ ఇండియా (సిమీ) ఉగ్ర‌వాది గుర్ఫాన్ వెల్ల‌డించాడు. ఇత‌ను చెప్పిన విష‌యాలు విని పోలీసులే షాకయ్యారు. విచారణలో గుర్ఫాన్ నోరు విప్పిన‌ప్పుడు చత్తీస్ఘడ్ పోలీసులకు అనేక విష‌యాలు తెలిశాయి. అంబికాపూర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయాలని ప్లాన్ చేశామని, అయితే  కొన్ని కారణాల […]

మోడీ అంత‌మే మా పంతం: సిమీ
X
గ‌త సార్వ‌త్రిక ఎన్నిక‌ల సంద‌ర్భంగానే న‌రేంద్ర‌మోడిని అంతం చేయాల‌ని ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌ని, అయితే కొన్ని కార‌ణాల వ‌ల్ల అది సాధ్యం కాలేద‌ని స్టూడెంట్ ఇస్లామిక్ మూమెంట్ ఆప్ ఇండియా (సిమీ) ఉగ్ర‌వాది గుర్ఫాన్ వెల్ల‌డించాడు. ఇత‌ను చెప్పిన విష‌యాలు విని పోలీసులే షాకయ్యారు. విచారణలో గుర్ఫాన్ నోరు విప్పిన‌ప్పుడు చత్తీస్ఘడ్ పోలీసులకు అనేక విష‌యాలు తెలిశాయి. అంబికాపూర్ లోక్సభ ఎన్నికల ప్రచారంలో భారత ప్రధాని నరేంద్ర మోడీని హత్య చేయాలని ప్లాన్ చేశామని, అయితే కొన్ని కారణాల వల్ల తమ పథకం అమలు చేయలేక పోయామని పోలీసుల విచారణలో చెప్పాడు. ఇండోర్ పోలీసులు ఇజాయిద్దీన్, అస్లాంను ఎన్కౌంటర్లో చంపేశారు. వారు హతమైన తరువాత భ‌యానికి గురైన గుర్ఫాన్ స్వయంగా పోలీసులకు లొంగిపోయాడు. రాష్ట్ర ఐజీ జేపీసింగ్ తెలిపిన వివరాల ప్రకారం.. జార్ఖండ్ పేలుళ్ళ సంఘటన తరువాత పరారైన గుర్ఫాన్ అరేబియన్ సముద్రానికి సమీపంలో తలదాచుకున్నాడు. కొంతకాలం తరువాత అక్కడి నుండి అతను దుబాయ్కు వెళ్లాడు. అక్కడ అంతర్జాతీయ ఉగ్రవాది అబూసలేంతో సమావేశమయ్యాడు. అంతేకాదు సిమీ నేతల ఆధ్వర్యంలో నేపాల్లో జరిగిన న్యూ ఇయర్ గ్రాండ్ పార్టీకి కూడా హాజరైనట్టుగా పోలీసులు చెబుతున్నారు. ఈ పార్టీకీ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సిమీ నేరగాళ్లందరూ హాజరైనా కూడా భారతీయ నిఘా వ్యవస్థ కనుక్కోలేక పోయిందని గుర్ఫాన్ పోలీసుల‌కు తెలిపినట్టుగా తెలుస్తోంది.-పీఆర్‌
First Published:  12 April 2015 3:17 AM IST
Next Story