Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 45

లేని రోగం! ‘కొవ్వు పదార్ధాలు తగ్గించు. మటన్‌, చికెన్‌ మానెయ్‌, స్వీట్లు తినకు. రోజుకు మూడు సిగరెట్ల కన్నా ఎక్కువ తాగకు. వారంలో నీ ఆరోగ్యం కుదుట పడుతుంది’ అని డాక్టర్‌ పంపేశాడు. వారం తరువాత పేషెంట్‌ వచ్చాడు. ఆయాస పడుతూ, నీరసంగా సోలుతూ, దగ్గుతున్నాడు. ‘ఏమైంది, నేను చెప్పినట్లు డైట్‌ మెయిన్‌టైన్‌ చేశావా?’ అన్నాడు డాక్టర్‌. పేషెంట్‌ ఆయాసంతో ‘మీరు చెప్పినట్లే చేశాను డాక్టర్‌. చికెన్‌, మటన్‌ తినడం మానే శాను. కొవ్వు పదార్ధాలు మానేశాను. […]

లేని రోగం!
‘కొవ్వు పదార్ధాలు తగ్గించు. మటన్‌, చికెన్‌ మానెయ్‌, స్వీట్లు తినకు. రోజుకు మూడు సిగరెట్ల కన్నా ఎక్కువ తాగకు. వారంలో నీ ఆరోగ్యం కుదుట పడుతుంది’ అని డాక్టర్‌ పంపేశాడు.
వారం తరువాత పేషెంట్‌ వచ్చాడు. ఆయాస పడుతూ, నీరసంగా సోలుతూ, దగ్గుతున్నాడు.
‘ఏమైంది, నేను చెప్పినట్లు డైట్‌ మెయిన్‌టైన్‌ చేశావా?’ అన్నాడు డాక్టర్‌.
పేషెంట్‌ ఆయాసంతో ‘మీరు చెప్పినట్లే చేశాను డాక్టర్‌. చికెన్‌, మటన్‌ తినడం మానే శాను. కొవ్వు పదార్ధాలు మానేశాను. అవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించలేదు కానీ మూడు సిగరెట్లు తాగడం నరకంలా ఉంది. దగ్గుతో చస్తున్నా. ఇంతకు పూర్వం ఎప్పుడూ నేను సిగరెట్లు తాగలేదు!’ అన్నాడు.

***********

కుక్క కరిచింది
ఒక ముసలావిడ పార్కుకు వచ్చింది. సునీత కూర్చుని ఉంటే పక్కనే ఒక కుక్క తోక కదిలిస్తూ వచ్చింది. ముసలావిడ వచ్చి సునీత పక్కనే కూర్చుంటూ కుక్కను చూసి ‘మీ కుక్క కరుస్తుందా?’ అని అడిగింది. సునీత ‘కరవదు’ అంది.
పక్కనే ఉన్న కుక్కను ముసలావిడ తల నిమరడానికి ప్రయత్నిస్తే ఆవిడ వేలిని కరిచింది. ముసలావిడ ‘కుయ్యో మొర్రో’ అంటూ ‘మీ కుక్క కరవదని చెప్పావే’ అంది సునీతతో.
సునీత ‘అవును. మా కుక్క కరవదని చెప్పిన మాట నిజమే’ అంది.
‘మరి కరిచిందే’ అంది ముసలావిడ.
‘ఇది మా కుక్క కాదు’ అంది సునీత.

***********

నిద్రా భంగం
గవర్నమెంటు ఆఫీసు ముందున్న బోర్డులో ఇలా రాశారు ‘నిశ్శబ్దంగా ఉండండి’. దానికింద ఎవరో యింకో వాక్యం చేర్చారు ‘లేకుంటే నిద్రపోయే వాళ్ళకు ఇబ్బంది కలుగుతుంది’.

***********

మగాడినే
ఆనంద్‌ నుదిటిపై ప్లాస్టర్‌ అతికించుకుని కనిపించాడు. ఆనంద్‌ స్నేహితుడు ‘ఏమైంది?’ అన్నాడు.
‘నిన్న మా ఆవిడకు, నాకూ గొడవ జరిగింది’ అన్నాడు.
‘జరిగితే?’
‘మా ఆవిడ కొట్టింది’
‘కొట్టిందా!’ ఆశ్చర్యంగా అన్నాడు మిత్రుడు.
ఆనంద్‌ ఏమీ మాట్లాడలేదు.
మిత్రుడు ‘ఆనంద్‌ నువ్వు మగాడివా! పిల్లివా?’ అన్నాడు రోషంగా.
‘ఔను! నేను మగాడినే! మా ఆవిడకు పిల్లులంటే భయం’ అన్నాడు ఆనంద్‌.

First Published:  12 April 2015 1:30 PM IST
Next Story