Telugu Global
National

గ‌వ‌ర్న‌ర్‌ల ప‌ర్య‌ట‌న‌ల‌పై హోంశాఖ ఆంక్ష‌లు!

ఉద్యోగస్తులు మాదిరిగానే ఇక‌నుంచి ఉన్న రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళాల‌న్నా… ఇంకో దేశానికి ప‌య‌న‌మ‌వ్వాల‌న్నా గ‌వ‌ర్న‌ర్లు కూడా అనుమ‌తి తీసుకోవ‌ల‌సిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం గవర్నర్లు కూడా పనిచేస్తున్న రాష్ట్రం విడిచి వెళ్లడానికి  ఎందుకు వెళుతున్నారో, ఎన్ని రోజులు పర్యటిస్తారో రాష్ట్రపతికి తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఆయన ఓకే అంటే తప్ప వెళ్ళ‌డానికి వీలు లేదు. ఇప్పటికే గవర్నర్ల తొలిగింపు, నియామకాల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తోందనే అపవాదును ఎదుర్కొంటున్న మోడీ సర్కార్ తాజాగా గవర్నర్ల […]

ఉద్యోగస్తులు మాదిరిగానే ఇక‌నుంచి ఉన్న రాష్ట్రం నుంచి వేరే రాష్ట్రానికి వెళ్ళాల‌న్నా… ఇంకో దేశానికి ప‌య‌న‌మ‌వ్వాల‌న్నా గ‌వ‌ర్న‌ర్లు కూడా అనుమ‌తి తీసుకోవ‌ల‌సిందే. కేంద్ర ప్రభుత్వం కొత్తగా రూపొందించిన నిబంధనల ప్రకారం గవర్నర్లు కూడా పనిచేస్తున్న రాష్ట్రం విడిచి వెళ్లడానికి ఎందుకు వెళుతున్నారో, ఎన్ని రోజులు పర్యటిస్తారో రాష్ట్రపతికి తప్పనిసరిగా చెప్పాల్సిందే. ఆయన ఓకే అంటే తప్ప వెళ్ళ‌డానికి వీలు లేదు. ఇప్పటికే గవర్నర్ల తొలిగింపు, నియామకాల్లో ఇష్టారీతిగా వ్యవహరిస్తోందనే అపవాదును ఎదుర్కొంటున్న మోడీ సర్కార్ తాజాగా గవర్నర్ల పర్యటనలపై ఆక్షలు విధించడం చర్చనీయాంశమైంది. ఈ మేరకు కేంద్ర హోం మంత్రిత్వ శాఖ 18 నిబంధనలతో కూడిన ఉత్తర్వులను జారీచేసింది, వాటి ప్రకారం గవర్లర్లు వారు పనిచేస్తోన్న రాష్ట్రాల్లో కనీసం 292 రోజులు ఉండాల్సిందే. స్వదేశంలోగానీ, విదేశాల్లోగానీ పర్యటించదల్చుకుంటే రాష్ట్రపతి భవన్ ఆమోదం పోందాల్సిందే. పర్యటనకు ఒక‌టి నుంచి నాలుగు వారాల లోపు సమాచారం అందించాలి. కొన్నిసార్లు అత్యవసర పర్యటనలకు కూడా రాష్ట్రపతి అనుమతిని తప్పనిసరి చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇంత కచ్చితంగా కాకున్నప్పటికీ గవర్నర్ కు సంబంధించి కొన్ని నిబంధనలు ఇప్పటికే ఉన్నాయి. అయితే కొందరు వాటిని ఉల్లంఘిస్తూ నెలల తరబడి తాము పనిచేస్తోన్న రాష్ట్రాలకు దూరంగా ఉంటున్న నేపథ్యంలోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవ‌ల‌సి వ‌చ్చింద‌ని హోంశాఖ వర్గాలు తెలిపాయి.-పీఆర్‌
First Published:  12 April 2015 11:42 AM IST
Next Story