పవర్ స్టార్ కు కోపం వచ్చింది..
అటు సినిమాలు చేయక.. ఇటు పాలిటిక్స్ లోనూ యాక్టివ్ కాలేక సతమతం అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా ఒక ట్విట్ చేసి న్యూస్ మేకర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు బలవంతంగా సేకరించ వద్దని కొందరు రైతులు కోర్టు కొక్కెరు. ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఏపి ప్రభుత్వం హైకోర్టును కోరగా.. న్యాయస్థానం ప్రభుత్వానికి మెట్టికాయలు వేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన […]
అటు సినిమాలు చేయక.. ఇటు పాలిటిక్స్ లోనూ యాక్టివ్ కాలేక సతమతం అవుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. తాజాగా ఒక ట్విట్ చేసి న్యూస్ మేకర్ అయ్యారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం నూతన రాజధాని నిర్మాణం కోసం రైతుల నుంచి భూములు బలవంతంగా సేకరించ వద్దని కొందరు రైతులు కోర్టు కొక్కెరు. ఈ విషయంలో మినహాయింపు ఇవ్వాలని ఏపి ప్రభుత్వం హైకోర్టును కోరగా.. న్యాయస్థానం ప్రభుత్వానికి మెట్టికాయలు వేసింది. ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ జనసేన నాయకుడూ పవన్ కళ్యాణ్ .. రైతుల నుంచి ప్రభుత్వం బలవంతాన భూములు లాక్కుంటే..కచ్చితంగా వారి పక్షాన నిలబడి పోరాడతానని ట్విట్ చేశారు. మరి గతంలో ఒక రోజు అదే రైతుల కోసం రోడ్ షో చేసిన పవర్ స్టార్.. మరసటి రోజుకు చల్లబడి ఏపి కి చంద్రబాబే ఇంకో పదేళ్లు సీయం అని చెప్పారు. ఇంతలోనే మాట మార్చుకుని మళ్లీ రైతుల పక్షాన పోరాడాతానని చెప్పారు. దిగితే పూర్తిస్థాయి లో పాలిటిక్స్ కు దిగడం ..లేదంటే.. పూర్తిగా సినిమాలు చేసుకుంటూ.. ఎలక్షన్స్ సమయంలో తనకు నచ్చిన పార్టీకి మద్దుతు తెలపడం చేసుకోవడం బెటర్ అంటున్నారు పరిశీలకులు. మరి పవన్ కు ఈ ద్వైదీ భావన ఎప్పటికి విడేనో కదా.!