Telugu Global
NEWS

న్యాయమూర్తులకు బదులుగా శిక్షలు ఖరారు చేస్తున్న పోలీసులు

శేషాచలం అడవుల్లో 20 మంది కూలీల కాల్చివేత మరువక ముందే నిన్న విశాఖలో పోలీసులు వద్దని చెప్పినా వినకుండా సముద్రంలో స్నానాలు చేస్తున్న బాలురను, యువకులను పోలీసులు కఠినంగా శిక్షించారు. సముద్ర స్నానం చేస్తున్న యువకులకు డ్రాయర్లు మినహా ఒంటి మీద బట్టలూడదీసి మండుటెండలో సలసల కాగిపోతున్న గ్రానైట్ రాళ్ళ‌ మీద పడుకోబెట్టి పోలీసులు తమదైన రీతిలో శిక్ష విదించారు. అంతటి తీవ్రమైన ఎండలో మాడిపోయే గ్రానైట్ రాళ్ళ‌ మీద బలవంతంగా పడుకోబెట్టిన పోలీసులపై మానవ హక్కుల‌ […]

శేషాచలం అడవుల్లో 20 మంది కూలీల కాల్చివేత మరువక ముందే నిన్న విశాఖలో పోలీసులు వద్దని చెప్పినా వినకుండా సముద్రంలో స్నానాలు చేస్తున్న బాలురను, యువకులను పోలీసులు కఠినంగా శిక్షించారు. సముద్ర స్నానం చేస్తున్న యువకులకు డ్రాయర్లు మినహా ఒంటి మీద బట్టలూడదీసి మండుటెండలో సలసల కాగిపోతున్న గ్రానైట్ రాళ్ళ‌ మీద పడుకోబెట్టి పోలీసులు తమదైన రీతిలో శిక్ష విదించారు. అంతటి తీవ్రమైన ఎండలో మాడిపోయే గ్రానైట్ రాళ్ళ‌ మీద బలవంతంగా పడుకోబెట్టిన పోలీసులపై మానవ హక్కుల‌ కమీషన్, న్యాయస్థానాలు ఎలా ప్రతిస్పందిస్తాయో వేచి చూడాలి. పిల్లలు తప్పు చేస్తే తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వాలికాని ఇలా చేయటమేమిటి ? సముద్రస్నానం చేయ్యొద్దని పోలిసులు ఎప్పుడో చెప్పిన మాట మరచి ఎండ నుండి ఉపశమనం పొందేటందుకు నీల్లలో దిగిన యువకులను పోలీసులే ఈ విధంగా శిక్షిస్తే, పైన ఎండకు కింద గ్రానైట్ రాళ్ళ వేడికి వాళ్ళ ఆరోగ్యానికి ఏమన్నా అయితే ఎవరు భాద్యత వహించాలి ? ఇలా పోలీసులే శిక్షలు విధిస్తుంటే ఇక న్యాయస్థానాలు ఎందుకు ?

First Published:  11 April 2015 5:23 AM IST
Next Story