Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 42

యుద్ధం జార్జి : మా ముత్తాత నెపోలియన్‌తో యుద్ధం చేశాడు. మా తాత ఫ్రెంచి వాళ్ళతో యుద్ధం చేశాడు. మా నాన్న అమెరికన్లతో యుద్ధం చేశాడు. మేరీ : మీ కుటుంబం వాళ్ళకి అందర్తో పోట్లాడ్డమే పనిలా వుంది. *********** ఆపిల్‌ స్నేహం లోకేష్‌ స్కూల్‌ నించి వస్తూనే వాళ్ళమ్మ అతడి కుడి కన్ను వాచి వుండడం చూసి ‘ఏమైంది’ అని అడిగింది. ‘కిరణ్‌! కంటిమీద గుద్దాడు మమ్మీ’ అన్నాడు లోకేష్‌. వాళ్ళమ్మ మరుసటిరోజు లోకేష్‌కు ఒక […]

యుద్ధం
జార్జి : మా ముత్తాత నెపోలియన్‌తో యుద్ధం చేశాడు. మా తాత ఫ్రెంచి వాళ్ళతో యుద్ధం చేశాడు. మా నాన్న అమెరికన్లతో యుద్ధం చేశాడు.
మేరీ : మీ కుటుంబం వాళ్ళకి అందర్తో పోట్లాడ్డమే పనిలా వుంది.

***********
ఆపిల్‌ స్నేహం
లోకేష్‌ స్కూల్‌ నించి వస్తూనే వాళ్ళమ్మ అతడి కుడి కన్ను వాచి వుండడం చూసి ‘ఏమైంది’ అని అడిగింది. ‘కిరణ్‌! కంటిమీద గుద్దాడు మమ్మీ’ అన్నాడు లోకేష్‌. వాళ్ళమ్మ మరుసటిరోజు లోకేష్‌కు ఒక ఆపిల్‌ ఇచ్చి యింకో ఆపిల్‌ కిరణ్‌కు ఇచ్చి అతన్తో స్నేహం చేసుకోమంది. లోకేష్‌ సాయంత్రం ఇంటికొచ్చేసరికి లోకేష్‌ ఎడమ కన్నుకూడా వాచి వుంది. ‘ఏమైంది మళ్ళీ’ అంది వాళ్ళమ్మ. ‘నువ్వు చెప్పినట్లు కిరణ్‌కు ఆపిల్‌ ఇచ్చాను. కానీ కిరణ్‌ నా ఆపిల్‌ కూడా లాక్కొని నన్ను కొట్టాడు’ అన్నాడు.

***********

క్యూ
రేషన్‌షాపు ముందు పెద్ద క్యూ వుంది. కానీ అతను ముందుకు రాబోయాడు. జనం అతన్ని వెనక్కి నెట్టారు. మళ్ళీ ముందుకు రాబోయాడు. కానీ మళ్ళీ వెనక్కి నెట్టారు.
అతను, ‘ఇలా ఐతే ఈ రోజు నేను రేషన్‌షాపు తెరవను’ అన్నాడు.

***********

గదుల గోల
టీచర్‌ : రామూ! మీరు చాలా గదులున్న ఇల్లు కట్టారట కదా! కొత్త ఇల్లు ఎలా వుంది?
రాము : చాలా బావుంది టీచర్‌. నాకు, మా ఇద్దరక్కలకు కూడా ప్రత్యేకంగా ఎవరి గదులు వాళ్ళకున్నాయి. పాపం మా అమ్మకే లేదు. ఇప్పటికీ పాపం మా నాన్న గదిలోనే వుంటోంది.

***********

ప్రచారం
ఎలక్షన్ల టైంలో రాజకీయ నాయకుడు ప్రచారానికి వచ్చి ఒకరి ఇంటి తలుపు తట్టాడు. ఒక చిన్న కుర్రాడు తలుపు తీశాడు.
రాజకీయ నాయకుడు ముద్దుగా ‘బాబూ! మీ నాన్నగారు కాంగ్రెస్‌లో ఉన్నారా? బి.జె.పిలో ఉన్నారా?’ అని అడిగాడు.
ఆ కుర్రాడు ‘రెండిట్లోనూ లేరు. బాత్‌రూంలో ఉన్నారు’ అన్నాడు.

First Published:  11 April 2015 12:33 AM IST
Next Story