Telugu Global
Cinema & Entertainment

టైటిల్స్ ఓకే.. సినిమా ఎక్కడ

తన సినిమాల టైటిల్స్ తోనే ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయాలనుకుంటాడు వర్మ. స్టోరీలైన్ అనుకోగానే వెంటనే దానికో పేరు పెట్టేస్తాడు. ఆ వెంటనే ఓ ప్రెస్ నోట్ చకచకా సిద్ధమైపోతుంది. అంతే ఆ సినిమా వార్తల్లోకెక్కిపోతుంది. అది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది.. నటీనటులు ఎవరు అనే అంశాలేవీ అందులో ఉండవు. చివరికి ప్రెస్ నోట్ రిలీజైన తర్వాత ఇంకేదో సినిమాని సెట్స్ పైకి తీసుకొస్తాడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఇప్పటికే సెట్స్ పైకి తీసుకురాకుండా చాలా […]

టైటిల్స్ ఓకే.. సినిమా ఎక్కడ
X
తన సినిమాల టైటిల్స్ తోనే ఆడియన్స్ ను ఎట్రాక్ట్ చేయాలనుకుంటాడు వర్మ. స్టోరీలైన్ అనుకోగానే వెంటనే దానికో పేరు పెట్టేస్తాడు. ఆ వెంటనే ఓ ప్రెస్ నోట్ చకచకా సిద్ధమైపోతుంది. అంతే ఆ సినిమా వార్తల్లోకెక్కిపోతుంది. అది ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది.. నటీనటులు ఎవరు అనే అంశాలేవీ అందులో ఉండవు. చివరికి ప్రెస్ నోట్ రిలీజైన తర్వాత ఇంకేదో సినిమాని సెట్స్ పైకి తీసుకొస్తాడు రామ్ గోపాల్ వర్మ. ఇలా ఇప్పటికే సెట్స్ పైకి తీసుకురాకుండా చాలా టైటిల్స్ చెప్పేశాడు వివాదాల వర్మ.
అమ్మ త్రీడీ అన్నాడు ఆమధ్య. రాజావారి చేపలచెరువుతో పొలిటికల్ డ్రామా అని ఎనౌన్స్ చేశాడు. రానా-నథాలియాతో అదిరిపోయే సినిమా చేస్తానంటూ అప్పుడో పేరు ఎనౌన్స్ చేశాడు. ఇవేవీ ఇప్పటివరకు కార్యరూపందాల్చలేదు. సెట్స్ పైకి రాలేదు. అస్సలు దీనిపై చర్చే లేదు. ఇంతలోనే మరో సినిమా పేరు ప్రకటించాడు వర్మ. ఆ సినిమా పేరు కిల్లింగ్ వీరప్పన్. ఎర్రచందనం స్మగ్లర్ వీరప్పన్ జీవితాన్ని ఆధారంగా చేసుకొని ఓ అద్భుతమైన సినిమా తీస్తానంటూ ఊదరగొడుతున్నాడు.ప్రస్తుతం వర్మ చేతిలో 4 సినిమాలున్నాయి. వీటిలో 3 సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. మరి ఇలాంటి సమయంలో కిల్లింగ్ వీరప్పన్ అనే సినిమాని వర్మ పట్టాలపైకి తీసుకొస్తాడా.. లేక ఎప్పట్లానే తన పాత సినిమా టైటిళ్ల లిస్ట్ లో దీన్ని కూడా కలిపేస్తాడా అనేది చూడాలి.
First Published:  11 April 2015 5:58 AM IST
Next Story