గో మాంసాన్ని పంచిన జ్ఞాన్‌ఫీఠ్ పురస్కార గ్రహీత
బెంగుళూరు: కేంద్రంలోను, వివిధ రాష్ట్రాల్లోను భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాక బీజేపీ, ఇతర హిందూ సంస్థలు గో మాంస విక్రయాలను నిషేధించడం, వ్యతిరేకించడాన్నిపలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. బెంగుళూరులోని డి.వై.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో బెంగుళూరు టౌన్‌హాల్ ఎదుట నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో దీనికి సంబంధించి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సాహితీ వేత్తలు కె.మరుళ్ళ సిద్ధప్ప, జ్ఞాన్‌పీఠ పురస్కార గ్రహీత, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి గో […]
BY Pragnadhar Reddy11 April 2015 7:26 AM IST
X
Pragnadhar Reddy Updated On: 12 April 2015 4:13 AM IST
బెంగుళూరు: కేంద్రంలోను, వివిధ రాష్ట్రాల్లోను భారతీయ జనతాపార్టీ ప్రభుత్వాలు ఏర్పడ్డాక బీజేపీ, ఇతర హిందూ సంస్థలు గో మాంస విక్రయాలను నిషేధించడం, వ్యతిరేకించడాన్నిపలువురు ప్రముఖులు తీవ్రంగా ఖండించారు. బెంగుళూరులోని డి.వై.ఎఫ్.ఐ. ఆధ్వర్యంలో బెంగుళూరు టౌన్‌హాల్ ఎదుట నిర్వహించిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో దీనికి సంబంధించి నిరసనను వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో పాల్గొన్న ప్రముఖ సాహితీ వేత్తలు కె.మరుళ్ళ సిద్ధప్ప, జ్ఞాన్‌పీఠ పురస్కార గ్రహీత, సినీ నటుడు గిరీష్ కర్నాడ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి గో మాంసాన్ని పంచారు. ఆహారం విషయంలో నిషేధాలు పనికి రావని, ఇతరుల అభిప్రాయాలను కూడా గౌరవించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో డి.వై.ఎఫ్.ఐ. కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కాగా ఈ కార్యక్రమ నిర్వహణను, సమావేశంలొ గో మాంసాన్ని పంచడాన్ని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది.
Next Story