కుక్కకాటుకు 2 లక్షల పరిహారం!
కుక్క కరిచిందా… అయితే మీరు ఇక కేసు వేయవచ్చు. ఎవరి మీద వేయాలని కదా… మీ ఆలోచన. ముందుగా మీ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ మీద వేయండి… అందులోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీ చేయండి… మీకు ఖచ్చితంగా నష్ట పరిహారం వచ్చి తీరుతుంది. ఎందుకంటే… కుక్కకాటు బాధితులకు రెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ జస్టిస్ అలోక్నాథ్, జస్టిస్ సర్వేష్ కుమార్ ల డివిజన్ బెంచ్ గురువారం తీర్పు చెప్పింది. తీవ్రంగా గాయపడిన వారికి రెండు […]
BY Pragnadhar Reddy11 April 2015 2:58 PM IST
X
Pragnadhar Reddy Updated On: 12 April 2015 4:44 AM IST
కుక్క కరిచిందా… అయితే మీరు ఇక కేసు వేయవచ్చు. ఎవరి మీద వేయాలని కదా… మీ ఆలోచన. ముందుగా మీ పరిధిలోని మున్సిపల్ కార్పొరేషన్ మీద వేయండి… అందులోనే రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా పార్టీ చేయండి… మీకు ఖచ్చితంగా నష్ట పరిహారం వచ్చి తీరుతుంది. ఎందుకంటే… కుక్కకాటు బాధితులకు రెండు లక్షల రూపాయల పరిహారం ఇవ్వాలంటూ జస్టిస్ అలోక్నాథ్, జస్టిస్ సర్వేష్ కుమార్ ల డివిజన్ బెంచ్ గురువారం తీర్పు చెప్పింది. తీవ్రంగా గాయపడిన వారికి రెండు లక్షలు, పాక్షికంగా గాయపడిన వారికి లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. వీధి కుక్కలు, కోతులు, గిబ్బన్స్ దాడిలో గాయపడిన వారికి కూడా ఈ ఆదేశాలు వర్తిస్తాయని హైకోర్టు స్పష్టంగా పేర్కొంది . ఈ పరిహార మొత్తాన్నిమున్పిపల్ కార్పోరేషన్, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్త ఆధ్వర్యంలో విధిగా చెల్లించాలని ఆదేశించింది. అది కూడా ఘటన జరిగిన ఒక వారం రోజుల లోపే ఈ చెల్లింపు జరగాలని సూచించింది. నైనితాల్ పట్టణంలో గత మూడేళ్ల కాలంలో జరిగిన నాలుగువేల వీధి కుక్కకాటు కేసులను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు గత జనవరిలో రాష్ట్ర ప్రభుత్వానికి, మున్సిపాలిటీ సంస్థకు కొన్ని మార్గదర్శకాలను జారీ చేసింది. రోజురోజుకు పెరుగుతున్న కుక్కకాటు సంఘటలను నివారించడానికి చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. మరి మీరెప్పుడైనా కుక్కల బారిన పడి కాటుకు గురయితే ఈ తీర్పు చాలు మీకు పరిహారం తెచ్చిపెట్టడానికి! -పీఆర్
Next Story