అబ్బాయిలు మాట నిలపుకున్నారు..బాబాయ్ ఏం చేస్తాడో..!
ఈ యేడాది నందమూరి అభిమానులకు ప్రథమార్దంలోనే మంచి కిక్ తగలినట్లే అని చెప్పాలి. గత యేడాది బాబాయ్ బాలయ్య, లెజెండ్‌తో దుమ్ము లేపాశాడు. అయితే అబ్బాయిలు కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి హిట్ కోసం చాల కష్టపడ్డారు. అయితే ఈ యేడాది కళ్యాణ్ రామ్ డ్రీమ్ నెరవేరింది. పటాస్ చిత్రంతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి స్టోరి, తనకు తగ్గట్లు కళ్యాణ్ రామ్ ఎనర్జటిక్ యాక్షన్ వెరసీ పటాస్ ను […]
BY Pragnadhar Reddy10 April 2015 7:29 AM IST
X
Pragnadhar Reddy Updated On: 10 April 2015 8:58 AM IST
ఈ యేడాది నందమూరి అభిమానులకు ప్రథమార్దంలోనే మంచి కిక్ తగలినట్లే అని చెప్పాలి. గత యేడాది బాబాయ్ బాలయ్య, లెజెండ్‌తో దుమ్ము లేపాశాడు. అయితే అబ్బాయిలు కళ్యాణ్ రామ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ మంచి హిట్ కోసం చాల కష్టపడ్డారు. అయితే ఈ యేడాది కళ్యాణ్ రామ్ డ్రీమ్ నెరవేరింది. పటాస్ చిత్రంతో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. మంచి స్టోరి, తనకు తగ్గట్లు కళ్యాణ్ రామ్ ఎనర్జటిక్ యాక్షన్ వెరసీ పటాస్ ను సూపర్హిట్ చేశాయి. ఇక అన్నయ్య కళ్యాణ్ రామ్ ఇచ్చిన సక్సెస్ జోష్ ను ఎన్టీఆర్ టెంపర్ తో కంటిన్యూ చేశాడు. పూరి జగన్నాధ్ డైరెక్షన్ లోవచ్చిన రీవేంజ్ డ్రామ్ స్టోరిని జనరంజకం చేసి మరో హిట్‌తో నందమూరి హీరో అభిమానుల్ని ఖుషి చేశాడు.
కట్ చేస్తే.. బాబాయ్ బాలయ్య, కొత్త దర్శకుడు సత్యదేవ్ తో లయన్ పేరు తో ఒక చిత్రం చేస్తున్నారు. బాలకృష్ణ సిబిఐ ఆఫీసర్ గా నటి్ంచిన లయన్ చిత్రం ఆడియో విడుదల గురువారం హైద్రాబాదులో జరిగింది. ఈ సినిమా ప్రచార చిత్రాల్లో బాలయ్య ఇమేజ్‌కు తగ్గట్లు డైలాగ్స్ పెట్టారు. మరి సినిమా ఎలా వుంటుందో. అబ్బాయిలిద్దరు అందించిన సక్సెస్ ను బాలయ్య కంటిన్యూ చేసి.. ఈ యేడాది నందమూరి హీరోల నామ సంవత్సరం అనిపిస్తాడో లేదో…! లెట్స్ వెయిట్ అండ్ సీ.!
Next Story