Telugu Global
NEWS

కోమ‌టిరెడ్డి పెద్ద బేవ‌కూప్ : పాల్వాయి

టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియామకాన్ని తప్పు పట్టిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఆయన ఫైర్‌ అయ్యారు. కోమటిరెడ్డి ఒక బేవకూఫ్‌ అని, భూమ్మీద ఉన్న పెద్ద మూర్ఖుడు(బిగ్గెస్ట్‌ ఫూల్‌ ఆన్‌ ద ఎర్త్‌))  అని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీకి కార్యాధ్యక్ష పదవి ఇవ్వాలని, ఆయన పార్టీలో కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.సీఎల్పీ కార్యాలయం వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీకి అవసరమేనని, కానీ… రాహుల్‌ మరిన్ని […]

కోమ‌టిరెడ్డి పెద్ద బేవ‌కూప్ : పాల్వాయి
X
టీపీసీసీ అధ్యక్షుడిగా ఉత్తమ్‌కుమార్‌రెడ్డి నియామకాన్ని తప్పు పట్టిన నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిపై ఆయన ఫైర్‌ అయ్యారు. కోమటిరెడ్డి ఒక బేవకూఫ్‌ అని, భూమ్మీద ఉన్న పెద్ద మూర్ఖుడు(బిగ్గెస్ట్‌ ఫూల్‌ ఆన్‌ ద ఎర్త్‌)) అని వ్యాఖ్యానించారు. రాహుల్‌గాంధీకి కార్యాధ్యక్ష పదవి ఇవ్వాలని, ఆయన పార్టీలో కీలక పాత్ర పోషించాలని కాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి అభిప్రాయపడ్డారు.సీఎల్పీ కార్యాలయం వద్ద విలేఖర్లతో మాట్లాడుతూ రాహుల్‌గాంధీ, సోనియాగాంధీ ఇద్దరూ కాంగ్రెస్‌ పార్టీకి అవసరమేనని, కానీ… రాహుల్‌ మరిన్ని బాధ్యతలు స్వీకరించాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొంత మంది రాజీవ్‌గాంధీకి మధ్యవర్తులుగా వ్యవహరించి, ఆయనను తప్పుదారి పట్టించారని, ఇప్పుడు రాహుల్‌ విషయంలోనూ కొంతమంది నేతలు అలాగే వ్యవహరిస్తున్నారని తెలిపారు. ఇలాంటి నేత‌ల‌ను గుర్తించి రాహుల్ కు దూరంగా పెట్టాల‌ని ఆయ‌న అన్నారు.-పీఆర్‌.
First Published:  10 April 2015 6:22 AM IST
Next Story