ముంబాయి పేలుళ్ళ సూత్రధారి లఖ్వీ విడుదల
ముంబాయి పేలుళ్ళ సూత్రధారి లఖ్వీని పాకిస్థాన్ విడుదల చేసింది. పాక్‌లోని లాహోర్ కోర్టు ఆదేశం మేరకు ఇతన్ని విడుదల చేసినట్టు ప్రకటించింది. ముంబాయి నడిబొడ్డున నరమేధానికి కారణమైన ఉగ్రవాదిని విడుదల చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ చర్య ఉగ్రవాదులకు ఊతం ఇస్తుందని భారత్ అభిప్రాయపడింది. ఘాటుగా తన నిరసనను తెలియజేసింది. లఖ్వీ విడుదల కాకుండా చూడాల్సిన పాక్ ప్రభుత్వం అతనికి ఊతం ఇచ్చేట్టుగా వ్యవహరించిందని, అతనికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తప్పు పట్టింది. […]
BY Pragnadhar Reddy10 April 2015 11:25 AM IST
Pragnadhar Reddy Updated On: 10 April 2015 11:25 AM IST
ముంబాయి పేలుళ్ళ సూత్రధారి లఖ్వీని పాకిస్థాన్ విడుదల చేసింది. పాక్‌లోని లాహోర్ కోర్టు ఆదేశం మేరకు ఇతన్ని విడుదల చేసినట్టు ప్రకటించింది. ముంబాయి నడిబొడ్డున నరమేధానికి కారణమైన ఉగ్రవాదిని విడుదల చేయడాన్ని భారత్ తప్పుపట్టింది. ఈ చర్య ఉగ్రవాదులకు ఊతం ఇస్తుందని భారత్ అభిప్రాయపడింది. ఘాటుగా తన నిరసనను తెలియజేసింది. లఖ్వీ విడుదల కాకుండా చూడాల్సిన పాక్ ప్రభుత్వం అతనికి ఊతం ఇచ్చేట్టుగా వ్యవహరించిందని, అతనికి వ్యతిరేకంగా బలమైన ఆధారాలు చూపడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని తప్పు పట్టింది. ఇలాంటి చర్యలు దేశ ప్రతిష్టను దిగజారుస్తాయని భారత్ గుర్తు చేసింది.-పీఆర్
Next Story