Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 40

గాడిద బుర్ర తాగుడు గురించి ఒక పెద్దమనిషి ఉపన్యసిస్తున్నాడు. ‘ఒక టబ్‌లో నీళ్ళు, యింకో టబ్‌లో బీరుపోసి పెడతాం. అప్పుడు వెళ్లి ఒక గాడిదను తీసుకొస్తాం. తీసుకొచ్చే గాడిద వాటిలో వేటిని తాగుతుంది?’ ‘నీళ్ళు తాగుతుంది’ అన్నాడు ఒక ప్రేక్షకుడు. ‘నీళ్ళే ఎందుకు తాగుతుంది?’ అని అడిగాడతను. ‘ఎందుకంటే అది గాడిద కాబట్టి’ అన్నాడు శ్రోత. ************ టూ ఇంటెలిజెంట్‌ ‘మా ఆవిడ జ్ఞాపకశక్తి దారుణమైంది’. ‘ఏమిటి? అన్నీ మరచిపోతుందా?’ ‘కాదు, ఏదీ మరచిపోదు’. *********** అన్నీ […]

గాడిద బుర్ర
తాగుడు గురించి ఒక పెద్దమనిషి ఉపన్యసిస్తున్నాడు.
‘ఒక టబ్‌లో నీళ్ళు, యింకో టబ్‌లో బీరుపోసి పెడతాం. అప్పుడు వెళ్లి ఒక గాడిదను తీసుకొస్తాం. తీసుకొచ్చే గాడిద వాటిలో వేటిని తాగుతుంది?’
‘నీళ్ళు తాగుతుంది’ అన్నాడు ఒక ప్రేక్షకుడు.
‘నీళ్ళే ఎందుకు తాగుతుంది?’ అని అడిగాడతను.
‘ఎందుకంటే అది గాడిద కాబట్టి’ అన్నాడు శ్రోత.

************

టూ ఇంటెలిజెంట్‌
‘మా ఆవిడ జ్ఞాపకశక్తి దారుణమైంది’.
‘ఏమిటి? అన్నీ మరచిపోతుందా?’
‘కాదు, ఏదీ మరచిపోదు’.

***********

అన్నీ కష్టమే!
‘రాజూ! నీలాగా లావుగా ఉన్న వాళ్ళు సాధారణంగా మంచి వాళ్ళయి ఉంటారు. ఎందుకంటావ్‌?’
‘ఏం లేదు వాళ్ళు పోట్లాడలేరు. పరిగెత్తలేరు కదా! అందుకని’.

***********

బిల్డప్‌
‘నీళ్లలో పడిన నన్ను రక్షించడానికి మీరెంతో శ్రమపడ్డారనుకుంటాను’ అందా అమ్మాయి.
ఆ కుర్రాడు ‘అవును. మిమ్మల్ని రక్షించడానికి ముందుకొచ్చిన ముగ్గురితో పోట్లాడాల్సి వచ్చింది’ అన్నాడు.

************

చిన్న కోరిక
‘నీ చిన్నప్పటి కోరికలేవయినా నెరవేరాయా?’
‘ఒక్క కోరిక నెరవేరింది’
‘ఏమిటది?’
‘చిన్నప్పుడు మా అమ్మ నా జుత్తుపట్టుకుని లాగినప్పుడల్లా దేవుడా! నాకు బట్టతల వుంటే ఎంత బావుండేది?’ అనుకునేవాణ్ణి. యిప్పటికది నెరవేరింది.

First Published:  10 April 2015 12:30 AM IST
Next Story