కూలీల ఎన్‌కౌంటర్‌పై ఏపీకి హైకోర్టు ఝలక్!
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌గా చెప్పుకొస్తున్న ఎపీ ప్రభుత్వాన్ని ఈ కేసును హత్య కేసుగా నమోదు చేయాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లా తిరుపతి పరిసరాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది కూలీలు హతమైపోయిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన అనంతరం కేసు విచారణను సోమవారం నాటికి వాయిదా […]
BY Pragnadhar Reddy10 April 2015 9:35 AM IST
X
Pragnadhar Reddy Updated On: 10 April 2015 3:03 PM IST
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టు ఝలక్ ఇచ్చింది. ఇప్పటివరకు ఎన్‌కౌంటర్‌గా చెప్పుకొస్తున్న ఎపీ ప్రభుత్వాన్ని ఈ కేసును హత్య కేసుగా నమోదు చేయాలని ఆదేశించింది. చిత్తూరు జిల్లా తిరుపతి పరిసరాల్లో జరిగిన ఈ ఎన్‌కౌంటర్‌లో 20 మంది కూలీలు హతమైపోయిన విషయం తెలిసిందే. ఎన్‌కౌంటర్‌పై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఈ ఉత్తర్వులు ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసింది. 302 సెక్షన్ కింద కేసు నమోదు చేయాలని ఆదేశించిన అనంతరం కేసు విచారణను సోమవారం నాటికి వాయిదా వేసింది.-పీఆర్
Next Story