పేదరికంతో బాక్సింగ్ చేస్తున్న బంగారు తల్లి
ఆ అమ్మాయికి బాక్సింగ్ అంటే ప్రాణం. చదువంటే ఇంకా ఇష్టం. అందుకే పేదరికం పెనుభూతంలా వెంటాడుతున్నా, పరిస్థితులు అనుకూలించకపోయినా నిరాశకు గురికాలేదు. ఇళ్లలో పనిచేస్తూ తన ఆశలను, కలలను బతికించుకుంటోంది. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆ చేతులు ఇతరుల ఇళ్లలో గిన్నెలు కడుగుతున్నాయి, నేలని తుడుస్తున్నాయి, వంట చేస్తున్నాయి. హర్యానా అమ్మాయి రిషుమిట్టల్ కథ ఇది. కథలాంటి చేదు నిజం. పదో తరగతిలో ఉన్న రిషు మిట్టల్ తన చదువు, తన సోదరుడి […]
ఆ అమ్మాయికి బాక్సింగ్ అంటే ప్రాణం. చదువంటే ఇంకా ఇష్టం. అందుకే పేదరికం పెనుభూతంలా వెంటాడుతున్నా, పరిస్థితులు అనుకూలించకపోయినా నిరాశకు గురికాలేదు. ఇళ్లలో పనిచేస్తూ తన ఆశలను, కలలను బతికించుకుంటోంది. రాష్ట్రస్థాయి బాక్సింగ్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించిన ఆ చేతులు ఇతరుల ఇళ్లలో గిన్నెలు కడుగుతున్నాయి, నేలని తుడుస్తున్నాయి, వంట చేస్తున్నాయి. హర్యానా అమ్మాయి రిషుమిట్టల్ కథ ఇది. కథలాంటి చేదు నిజం.
పదో తరగతిలో ఉన్న రిషు మిట్టల్ తన చదువు, తన సోదరుడి చదువు కొనసాగడానికి అష్టకష్టాలు పడుతోంది. రిషులో అత్యంత ప్రతిభా పాటవాలు ఉన్నాయని, కానీ ఆమెకు అండగా నిలిచే వారు లేరని కోచ్ రాజేంద్ర సింగ్ అంటున్నారు. ప్రభుత్వం తరపున కానీ, సహృదయుల నుండి కానీ రిషుకి ఆర్థిక సహాయం అందితే ఆమె బాక్సింగ్ లో మేరీకామ్ స్థాయికి చేరి దేశం పేరుని నిలబెడుతుందని ఆయన నమ్మకంగా చెబుతున్నారు. రిషు గత ఏడాది డిసెంబర్ లో జరిగిన జాతీయ ఛాంపియన్ షిప్ పోటీలకు సైతం హర్యానా తరపున హాజరైంది. ప్రస్తుతం రిషు పనులు చేస్తూనే చదువుని, బాక్సింగ్ సాధనను కొనసాగిస్తోంది. ఈ మట్టిలో మాణిక్యాన్ని, బంగారు తల్లిని జాతి గర్వించేలా తీర్చిదిద్దాల్సిన అవసరం ఉంది.