జర నవ్వండి ప్లీజ్ 38
కొత్త డ్రస్సు… కొత్త బాయ్‌ఫ్రెండ్ కాలేజీ అమ్మాయి వాళ్ళమ్మకో ఉత్తరం రాసింది. ”డియర్ మమ్మీ. ఇక్కడంతా అద్భుతంగా ఉంది. నాకు ఎంతో చక్కగా ఉన్న కుర్రాడు పరిచయమయ్యాడు. అతను నా జూనియర్. ఫుట్‌బాల్ ఆడతాడు. అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. బాగా చదువుతాడు. అతన్తో కలిసి ఎనిమిదిసార్లు బయటికి వెళ్ళాను. ఎనిమిదిసార్లూ వెళ్ళినప్పుడల్లా కొత్త డ్రస్ వేసుకున్నాను. వచ్చేవారం సినిమాకు వెళదామన్నాడు. అందుకని కొత్త డ్రస్సు కొందామనుకుంటున్నాను. వెంటనే వెయ్యి రూపాయలు పంపు” దానికి వాళ్ళమ్మ వెంటనే బదులు […]
కొత్త డ్రస్సు… కొత్త బాయ్‌ఫ్రెండ్
కాలేజీ అమ్మాయి వాళ్ళమ్మకో ఉత్తరం రాసింది.
”డియర్ మమ్మీ.
ఇక్కడంతా అద్భుతంగా ఉంది. నాకు ఎంతో చక్కగా ఉన్న కుర్రాడు పరిచయమయ్యాడు. అతను నా జూనియర్. ఫుట్‌బాల్ ఆడతాడు. అందంగా ఆకర్షణీయంగా ఉన్నాడు. బాగా చదువుతాడు. అతన్తో కలిసి ఎనిమిదిసార్లు బయటికి వెళ్ళాను. ఎనిమిదిసార్లూ వెళ్ళినప్పుడల్లా కొత్త డ్రస్ వేసుకున్నాను. వచ్చేవారం సినిమాకు వెళదామన్నాడు. అందుకని కొత్త డ్రస్సు కొందామనుకుంటున్నాను. వెంటనే వెయ్యి రూపాయలు పంపు”
దానికి వాళ్ళమ్మ వెంటనే బదులు ఇచ్చింది. ”కొత్త బట్టలు కొనాల్సిన అవసరం లేదు. కొత్త బాయ్‌ఫ్రెండ్‌ని వెతుక్కుని పాత డ్రస్సుల్తో ప్రారంభించు.”
************
విశ్రాంతి
‘మీ భర్తకు పూర్తి విశ్రాంతి కావాలి. ఈ నిద్రమాత్రలు తీసుకోండి’
‘ఇవి ఆయనకు ఎప్పుడు ఇవ్వమంటారు’.
‘ఇవి మీ ఆయన కోసం కాదు, మీకే’.
************
శ్రమ
‘సార్! పదేళ్ల నించి ఒక్కణ్ణి ముగ్గురు చేసే పనిచేస్తున్నా. నా కష్టం చూసి నా జీతం పెంచండి’.
‘నీ జీతం పెంచను కానీ తక్కిన ముగ్గురూ ఎవరో చెప్పు, వాళ్ల పని పడతాను’.
************
దొంగ… దొంగ
‘ఏమండీ! మన పని మనిషి రెండు టవల్స్ దొంగిలించింది’.
‘ఏ రంగువి?’
‘ఒకటి తెల్లది. రెండోది మనం హోటల్‌నించి ఎత్తుకొచ్చేసిన నీలం రంగుది.’