నిజాలు మాకే తెలుసు- తమన్నా
ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకుంటారు. ఇక హీరోయిన్స్ రెమ్యున్ రేషన్ గురించి నోట్లో నాలుక లేకుండా చెప్పుకుంటుంటారు. అయితే అసలు నిజాలు మాత్రం మాకే తెలుసు అంటోంది హాట్ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం “బాహుబలి”, “బెంగాల్ టైగర్” చిత్రాలు చేస్తున్న తమన్నా.. చిత్ర సీమలో హీరోయిన్స్ మధ్య స్నేహాం ఉండదనే విషయాన్ని ఖండించింది. హీరోయిన్స్ మధ్య సఖ్యత లేదంటే తను అసలు అంగీకరించనని తెలిపింది. తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ హీరోయిన్ […]
ఇండస్ట్రీలో హీరోయిన్స్ గురించి ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడుకుంటారు. ఇక హీరోయిన్స్ రెమ్యున్ రేషన్ గురించి నోట్లో నాలుక లేకుండా
చెప్పుకుంటుంటారు. అయితే అసలు నిజాలు మాత్రం మాకే తెలుసు అంటోంది హాట్ బ్యూటీ తమన్నా. ప్రస్తుతం “బాహుబలి”, “బెంగాల్ టైగర్” చిత్రాలు చేస్తున్న తమన్నా.. చిత్ర సీమలో హీరోయిన్స్ మధ్య స్నేహాం ఉండదనే విషయాన్ని ఖండించింది. హీరోయిన్స్ మధ్య సఖ్యత లేదంటే తను అసలు అంగీకరించనని తెలిపింది. తను ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఓ హీరోయిన్ తనకు కాస్ట్యూమ్స్ విషయంలో ఎంతగానో సహాయ పడిందట. నిజంగా హీరోయిన్స్ మధ్య సఖ్యత లేక పోతే ..కేవలం హీరోయిన్స్ మధ్య పోటినే అనుకుంటే తను ఎందుకు అంత సహాయ పడుతుందిని తేల్చింది. తెర వెనక ఏం జరుగుతుందో నిజంగా బయటి వారికి ఏం తెలియదు . అయితే ఎక్కువ మంది తెర వెనక విషయాల్నే ఎవరికి తోచినట్లు వాళ్లు మాట్లాడటం అనేది విచిత్రం అంటోంది అందాల ముద్దుగుమ్మ తమన్నా. సో బి హైండ్ ది స్క్రీన్ ఏం జరుగుతుంది అనేది తమకు మాత్రమే తెలుసంటోంది . నిజమే కదా.!