అయ్యా! హోంమంత్రి గారూ...!
గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులే కాదు. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఏం చేయబోయారన్న? విషయాలపై కూపీలాగుతుంటే నాయిని మాత్రం కొత్త కొత్త వాదనలు మాట్లాడుతున్నారు. అసలు సిమి ఉగ్రవాదాలతో హైదరాబాద్‌కే సంబంధం లేదట. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది కూడా హైదరాబాద్ వాసులు కాదట. కావాలనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారట. ఇలాంటి సమయంలో, పైగా హోంమంత్రిగా ఉండి ఇలాంటి […]
గుమ్మడికాయ దొంగ ఎవరంటే భుజాలు తడుముకున్నట్లు ఉంది తెలంగాణ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి వ్యవహారం. తెలుగు రాష్ట్రాల్లోని పోలీసులే కాదు. కేంద్ర నిఘా వర్గాలు కూడా ఉగ్రవాదులు ఎలా వచ్చారు? ఏం చేయబోయారన్న? విషయాలపై కూపీలాగుతుంటే నాయిని మాత్రం కొత్త కొత్త వాదనలు మాట్లాడుతున్నారు. అసలు సిమి ఉగ్రవాదాలతో హైదరాబాద్‌కే సంబంధం లేదట. ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది కూడా హైదరాబాద్ వాసులు కాదట. కావాలనే హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీస్తున్నారట. ఇలాంటి సమయంలో, పైగా హోంమంత్రిగా ఉండి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అసలు ఉగ్రవాదులే కాదని ప్రకటించిన హోంమంత్రి…మరి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారన్న అనుమానం కలుగుతోంది.
ఉగ్రవాదులు బస్సెక్కిందే హైదరాబాద్‌లో. రాత్రి పూట బస్సెక్కారంటే వాళ్లు కచ్చితంగా హైదరాబాద్‌లోనే ఉండి ఉంటారు. అంటే ఈ మహానగరంలో ఎవరో ఒకరు వారికి ఆశ్రయం ఇచ్చే ఉంటారు. అసలు ఉగ్రవాదుల కూపీ లాగాల్సింది పోయి తమకేం సంబంధం లేదని చెప్పడం విడ్డూరంగానే ఉంది. విచారణ పూర్తయిన తర్వాత ఇలాంటి వ్యాఖ్యలు చేసినా కొంచెం అర్థం ఉంటుంది. ఎన్‌కౌంటర్‌లో చిక్కుముడులెన్నో ఉన్నాయి. రెండు రోజులు ఉగ్రవాదులు ఎక్కడ ఉన్నారు? అన్న విషయాలు పూర్తి స్థాయిలో రుజువు కావాలి. వీళ్లెందుకు హైదరాబాద్ వచ్చారు. నిజంగానే విజయవాడ వెళుతున్నారా? వెళ్లాలనుకుంటే అక్కడేం చేయాలనుకున్నారు? అన్న విషయాలు స్పష్టం కావాలి. రాష్ట్రంతో సంబంధం లేకుండా పోలీసులు సహకరించుకుంటేనే వాస్తవాలన్నీ బయటపడతాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ హోంమంత్రి వ్యాఖ్యలు కాస్త ఆశ్చర్యంగానే ఉన్నాయి. అయినా ఆ పదవిలో ఉండి ఉగ్రవాదం మూలాలు తెలియకుండా మాట్లాడటం సరికాదన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఉగ్రవాదానికి ప్రాంతం, మతం, కులం, రంగు ఏమీ ఉండవన్నది చాలాసార్లు రుజువైంది. ఉగ్రదాడి విషయంలో ప్రాంతీయవాదానికి ముడిపెట్టడం సమంజసం కాదు.