ఎన్‌కౌంటర్ దాఖలాలేవి ?
‘శేషాచలం అడవుల్లో జరిగింది ఎన్‌కౌంటర్ కాదు. కచ్చితంగా హత్యలే అని, కూలీలను పట్టుకొచ్చి పోలీసులు కాల్చి చంపారు అని, ఘటనా స్థలాన్ని పరిశీలించిన మానవ హక్కుల సంఘాల వాళ్ళు చెబుతున్నారు. అందుకు చాలా కారణాలనే వివరిస్తున్నారు. 1. వంద మంది కూలీలు పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు. మరి 20 మందే చనిపోయారు. మిగిలిన వారెవరూ గాయపడలేదా? గాయపడితే వారేమయ్యారు? 2. చనిపోయిన 20 మందికీ బుల్లెట్లు నడుము భాగానికి పైనే తగిలాయి. అంటే […]
‘శేషాచలం అడవుల్లో జరిగింది ఎన్‌కౌంటర్ కాదు. కచ్చితంగా హత్యలే అని, కూలీలను పట్టుకొచ్చి పోలీసులు కాల్చి చంపారు అని, ఘటనా స్థలాన్ని పరిశీలించిన మానవ హక్కుల సంఘాల వాళ్ళు చెబుతున్నారు. అందుకు చాలా కారణాలనే వివరిస్తున్నారు.
1. వంద మంది కూలీలు పోలీసులపై దాడి చేయడానికి ప్రయత్నించారని అధికారులు చెబుతున్నారు. మరి 20 మందే చనిపోయారు. మిగిలిన వారెవరూ గాయపడలేదా? గాయపడితే వారేమయ్యారు?
2. చనిపోయిన 20 మందికీ బుల్లెట్లు నడుము భాగానికి పైనే తగిలాయి. అంటే చంపాలనే ఉద్దేశంతోనే కాల్పులు జరిగాయి.
3. పోలీసుల వైపున ఎవరికీ పెద్దగా గాయాలవలేదు. అంతమందిని చంపుతుంటే శత్రువులు ఊరుకుంటారా? కనీసమైనా దాడి చేస్తారు. ఆ ఆనవాళ్లు ఎక్కడా ఘటనా స్థలంలో కనిపించడం లేదు.
4. పోలీసులు చెబుతున్న ఎన్‌కౌంటర్ జరిగిన స్థలం ఖాళీ ప్రదేశం. కూలీలు ఖాళీ స్థలంలో ఎందుకుంటారు? ఒకవేళ దుంగలను తీసుకెళుతున్నారే అనుకుందాం? అంత బహిరంగంగా, అందరికీ కనిపించేలా ఏ దొంగలూ ఖాళీ ప్రదేశాల్లో నుంచి వెళ్లరు.
5. ముందు హెచ్చరించామని, ఆ తర్వాతే కాల్పులు జరిపామని పోలీసులు చెబుతున్నారు. అంటే కనీసం ఐదారు నిమిషాలు ఇద్దరి మధ్యా కొంత అరుపులు, కేకలు జరిగి ఉంటాయి. ఆ సమయంలో దొంగలు కనీసం చెట్ల మధ్యన దాక్కుంటారు. పోలీసులూ రక్షణ చూసుకునే హెచ్చరికలు జారీ చేస్తారు. ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని చూస్తే అలాంటి ఆనవాళ్లు కనిపించడం లేదు.
6. మృతదేహాలన్నీ పక్కపక్కనే పడి ఉన్నారు. కాల్పులు మొదలైన వెంటనే ఎవడికి వాడు పారిపోతాడు. ఎన్‌కౌంటర్ ప్రదేశంలో మాత్రం అంతా పక్కపక్కనే చనిపోయినట్లు ఉంది.
7. మృతదేహాల పక్కన పడి ఉన్న దుంగలు చాలా పాతవి. దొంగతనానికి వచ్చిన దొంగల దగ్గరకు పాత దుంగలు ఎలా వచ్చాయి? గతంలో ఎప్పుడూ ఎర్రచందనం గోడౌన్‌లో చోరీ జరగలేదు. పైగా ఘటనా స్థలంలో ఉన్న దుంగలపై సున్నం, ఎరుపు రంగు మచ్చలు ఉన్నాయి. అడవిలో దొంగలు నరికిన దుంగలకు రంగు ఉంటుందా?
8. వంద మంది దాడి చేయబోయారని పోలీసులు చెబుతున్నారు. ఆ తర్వాతే కాల్పులు జరిపామని అంటున్నారు. అదే జరిగే ఆ వంది మంది అంటే మిగిలిన 80 మంది చేతుల్లో ఉన్న సామానులో, దుంగలను వదిలేసి పారిపోతారు. మరి అవెక్కడ? దుంగలు తీసుకునే పారిపోయే పరిస్థితి ఉంటుందా?