రాజుగారి అగ్గిపెట్టె కథ
అనగనగా ఓ రాజుగారు. ఆయనకిపుడు రాజ్యం లేదు గాని మంత్రి పదవి ఉంది. కేంద్రంలో అత్యంత కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రి పదవిని ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనే మన విజయనగరం రాజావారు. పూసపాటి అశోకగజపతి రాజు. ఆయన సూట్‌కేస్‌లో ఎప్పుడూ రెండు దిండ్లు అంటే ఒక్కో దిండులో 20 ప్యాకెట్లు మూడైదుల(555) గుర్తు ఉన్న ఫారిన్ సిగరెట్లు ఉంటాయి. ఆయనను ఎప్పుడు చూసినా సిగరెట్ తాగుతూనే ఉంటారు. చైన్ స్మోకర్ అన్నమాట. రాజుగారు విమాన యాన […]
అనగనగా ఓ రాజుగారు. ఆయనకిపుడు రాజ్యం లేదు గాని మంత్రి పదవి ఉంది. కేంద్రంలో అత్యంత కీలకమైన పౌర విమానయాన శాఖ మంత్రి పదవిని ఆయన నిర్వహిస్తున్నారు. ఆయనే మన విజయనగరం రాజావారు. పూసపాటి అశోకగజపతి రాజు. ఆయన సూట్‌కేస్‌లో ఎప్పుడూ రెండు దిండ్లు అంటే ఒక్కో దిండులో 20 ప్యాకెట్లు మూడైదుల(555) గుర్తు ఉన్న ఫారిన్ సిగరెట్లు ఉంటాయి. ఆయనను ఎప్పుడు చూసినా సిగరెట్ తాగుతూనే ఉంటారు. చైన్ స్మోకర్ అన్నమాట. రాజుగారు విమాన యాన మంత్రి పదవి వచ్చాక టూర్లు ఎక్కువయ్యాయి. కాని విమానాల్లో అగ్గిపెట్టెలు, లైటర్లు తీసుకెళ్ళడానికి వీల్లేదని రూల్. మరి రాజుగారు మంత్రి గనుక ఆయన్ను సెక్యూరిటీ వాళ్ళు చెక్ చేయరు. అదివరకు ఆయన విమానయాన మంత్రి కాకముందు సెక్యూరిటీ గార్డులు కింది నుంచి మీదివరకు చెక్ చేస్తే సిగరెట్లతో పాటు అగ్గిపెట్టె, లైటర్ దొరికేవి. సిగరెట్లు ఆయనకిచ్చేసి, అగ్గిపెట్టెను సెక్యూరిటీవాళ్ళు తీసుకునేవారు. దాంతో బిక్కమొగం వేసుకుని రాజుగారు విమానం ఎక్కేవారు. విమానం గమ్యస్థానం చేరుకున్నాక ఎయిర్‌పోర్ట్‌లో అగ్గిపెట్టె కొనుక్కునేవారు. ఇప్పుడు రాజుగారికి ఆ సమస్య లేదు. మంత్రిగారిని చెక్ చేయరు కాబట్టి సిగరెట్లతో పాటు అగ్గిపెట్టెను కూడా ఎంచక్కా తీసుకెళ్ళుతున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా చెప్పారు కూడా. అది కూడా పౌర విమానయాన భద్రతా విభాగం వారు నిర్వహించిన సమావేశం సందర్భంగానే శ్రీమాన్ అశోక్‌గజపతి రాజు ఈ అగ్గిపెట్టె కథ చెప్పారు. విమానాల్లో మండే స్వభావం గలిగిన వాటిని బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న మీరు ఎలా తీసుకెళతారని మీడియా ప్రశ్నించడంతో ఆయన తన తెలివితేటలు ప్రదర్శించారు. మీరు ఎప్పుడైనా అగ్గిపెట్టె కారణంగా విమాన ప్రమాదాలు సంభవించినట్లు విన్నారా అని ఎదురు ప్రశ్నించారు. మీడియా మిత్రులనైతే నోరు మూయించారు. ఈ విషయం బయటపడింది గనుక ప్రతిపక్షాలు ఊరుకుంటాయా? మంత్రిగారిమీద మండిపడవూ..?