Telugu Global
NEWS

ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌

మంగళవారం తెల్లవారు ఝామున చంద్రగిరి మండలం ఈత గుంట దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారు. చనిపోయిన వారిలో ఎర్రచందనం స్మగ్లర్లు, తమిళనాడు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠావెనుక భాస్కరనాయుడి హస్తం వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులోని రాజకీయ పార్టీలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను పీసీసీ అధినేత రఘువీరారెడ్డి ఖండించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఎన్‌కౌంటర్‌ గురించి గవర్నర్‌కు వివరాలు తెలియజేశాడని […]

ఎర్రచందనం స్మగ్లర్ల ఎన్‌కౌంటర్‌
X

మంగళవారం తెల్లవారు ఝామున చంద్రగిరి మండలం ఈత గుంట దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్‌లో 20 మంది ఎర్రచందనం స్మగ్లర్లు మరణించారు. చనిపోయిన వారిలో ఎర్రచందనం స్మగ్లర్లు, తమిళనాడు కూలీలు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఎర్రచందనం స్మగ్లింగ్‌ ముఠావెనుక భాస్కరనాయుడి హస్తం వున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ ఎన్‌కౌంటర్‌పై తమిళనాడులోని రాజకీయ పార్టీలు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఎన్‌కౌంటర్‌ను పీసీసీ అధినేత రఘువీరారెడ్డి ఖండించారు.

ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఈ ఎన్‌కౌంటర్‌ గురించి గవర్నర్‌కు వివరాలు తెలియజేశాడని తెలుస్తోంది.

First Published:  7 April 2015 4:07 AM GMT
Next Story