రాజమౌళి ఒక రాజ్యాన్ని సృష్టించాడు
సినిమా అంటే ప్యాషన్ చాల మందికి. కానీ ఫిల్మ్ అంటే ప్రాణం అనే ఫీలింగ్ రాజమౌళి లాంటి కొద్ది మంది ఫిల్మ్ మేకర్స్ కే ఉంటుంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో స్టార్ హీరోలకు మించి క్రెడిట్ ను సంపాదించుకున్న దర్శక జక్కన..తాజాగా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ బాహుబలి దేశవ్యాప్తంగా ఫిల్మ్ వర్గాల్లో ఒక చర్చ లేపింది. పిరియాడిక్ చిత్రాలు ఈ రోజుల్లో చేయాలంటే ఎంతో రిస్క్ తో కూడుకున్న పని. అటువంటింది ఒక ప్రాంతీయ భాష లో దాదాపు 100 కోట్ల […]
సినిమా అంటే ప్యాషన్ చాల మందికి. కానీ ఫిల్మ్ అంటే ప్రాణం అనే ఫీలింగ్ రాజమౌళి లాంటి కొద్ది మంది ఫిల్మ్ మేకర్స్ కే ఉంటుంది. వరుస సక్సెస్ లతో టాలీవుడ్ లో స్టార్ హీరోలకు మించి క్రెడిట్ ను సంపాదించుకున్న దర్శక జక్కన..తాజాగా చేస్తున్న భారీ ప్రాజెక్ట్ బాహుబలి దేశవ్యాప్తంగా ఫిల్మ్ వర్గాల్లో ఒక చర్చ లేపింది. పిరియాడిక్ చిత్రాలు ఈ రోజుల్లో చేయాలంటే ఎంతో రిస్క్ తో కూడుకున్న పని. అటువంటింది ఒక ప్రాంతీయ భాష లో దాదాపు 100 కోట్ల కు పైగా బడ్జెట్ పెట్టి పిరియాడిక్ ఫిల్మ్ ను చేయడం నిజంగా సాహసమే అని చెప్పాలి. అయితే రాజమౌళి లాంటి దర్శకుడు కాబట్టి .. యావత్ తెలుగు అభిమాన సినిమా లోకం ఆయన పని తనం మీద నమ్మకం ఉంచింది. ఎందుకంటే..ఆయన ఉఫ్ అంటే ఎగిరిపోయే ఈగ తోనే అద్భుత విజయం సాధించిన దర్శక ఘనడు కాబట్టి.
గత రెండు సంవత్సరాల నుంచి బాహుబలి సినిమాను ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా లతో చెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమాకు ఆర్ట్ డైరెక్టర్ గుండెకాయి లాంటి వాడు. అందుకే ఈ విషయంలో రాజమౌళి ప్రపంచ స్థాయి కళా దర్శకుడు సాబు సిరిల్ ను ఎంచుకున్నారు. గతంలో హేరామ్, అశో్క , రావన్ , రోబో వంటి భారీ ప్రాజెక్ట్ లకు వర్క్ చేశారు సాబు. ఇక బాహుబలి గురించి ఒక పత్రికకు ఇచ్చిన ఇంటర్వూలో .. పలు విశేషాలు తెలిపారు బాహుబలి ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్.
ఈ సినిమా కోసం రాజమౌళి 'మహిష్మతి' అనే రాజ్యాన్నే సృష్టించారట. మరి రాజ్యమంటే మాటలా..? కోటలు, ఎతైనా కట్టడాలు, యుద్ద మైదనాలు నిర్మించాలి. ఈ బాధ్యతను కళా దర్శకుడు సాబు సిరిల్ కు అప్పగించారు.బాహుబలి వేయ్యేళ్ల నాటి కథ.దానికి తగ్గట్లు యాంబియన్స్, సెట్స్ నిర్మించడం పెద్ద ఛాలెంజ్ అన్నారు.అయితే దర్శకుడు రాజమౌళి కావలసినంత స్వేఛ్చ ఇవ్వడంతో అది సాధ్య పడిందని చెప్పారు. కళా దర్శకత్వమే కాదు . ఈ సినిమాకు సంబంధించిన ఏ విభాగమైన అవుట్ పుట్ ప్రపంచ స్థాయిలో వుంటుందని తెలిపారు. అసలే జక్కన్న. ఏ విషయంలోనున కాంప్రమైజ్ అయ్యే రకం కాదు. మొత్తం మీత బాహుబలి తెలుగు సినిమా చరిత్రలో ఒక మాష్టర్ పీస్ గా నిలుస్తుందని ఆశించడం అతిశయోక్తి కాదేమో.!