Telugu Global
Family

జర నవ్వండి ప్లీజ్ 35

రిపోర్టింగ్‌ వరదల గురించి పరిశీలించే ఇద్దరు విలేకరులు ”ఇక్కడో కరెంట్‌ తీగ వుంది. అందులో కరెంట్‌ వుందో లేదో తెలీడం లేదు” అని ఎడిటర్‌కు టెలిగ్రాం ఇచ్చారు. ఎడిటర్‌ ”మీ యిద్దర్లో ఒకరు వైరు పట్టుకోండి. అప్పుడు కరెంట్‌ వుందో లేదో తెలుస్తుంది. ఇంకొకరు ఆ సంగతి రిపోర్టు చెయ్యండి” అని బదులిచ్చాడు. *********** తేడా ”నువ్వా అమ్మాయిలో ఏం చూశావు?” ”ఆ అమ్మాయి ఇతరుల కన్నా ఎంతో ప్రత్యేకత కలిగింది.” ”ఇతరులకూ ఆ అమ్మాయికీ ఉన్న […]

రిపోర్టింగ్‌
వరదల గురించి పరిశీలించే ఇద్దరు విలేకరులు ”ఇక్కడో కరెంట్‌ తీగ వుంది. అందులో కరెంట్‌ వుందో లేదో తెలీడం లేదు” అని ఎడిటర్‌కు టెలిగ్రాం ఇచ్చారు.
ఎడిటర్‌ ”మీ యిద్దర్లో ఒకరు వైరు పట్టుకోండి. అప్పుడు కరెంట్‌ వుందో లేదో తెలుస్తుంది. ఇంకొకరు ఆ సంగతి రిపోర్టు చెయ్యండి” అని బదులిచ్చాడు.
***********
తేడా
”నువ్వా అమ్మాయిలో ఏం చూశావు?”
”ఆ అమ్మాయి ఇతరుల కన్నా ఎంతో ప్రత్యేకత కలిగింది.”
”ఇతరులకూ ఆ అమ్మాయికీ ఉన్న తేడా ఏమిటి?”
”ఆ అమ్మాయి నాతో తిరుగుతుంది. ఇతరులు తిరగరు.”
***********
సినిమా డైవోర్స్‌
హాలీవుడ్‌ నటీనటుల కాలనీ ముందు ముగ్గురు చిన్న పిల్లలు అట్లాడుకుంటున్నారు. ఒక అబ్బాయి ”నేను నాన్నను” అన్నాడు. అమ్మాయి ”నేను అమ్మను” అంది. యింకో కుర్రాడు ”ఐతే నేను డైవోర్స్‌ లాయర్ని” అన్నాడు.
***********
రివర్స్‌
ఒక కంపెనీ వాళ్ళు కొత్త డిటర్జెంట్‌ సోప్‌ తయారు చేశారు. ఆ సబ్బుని సౌదీ ఆరేబియాలో ప్రచారం చేయాలని పెద్ద ఎత్తున వాల్‌పోస్టర్లు తయారు చేశారు. వాల్‌పోస్టర్‌లో మొదట బాగా మురికిపట్టిన నల్లటి చొక్కా, తరువాత ఆ చొక్కాకు సబ్బు రుద్దడం, మూడో బొమ్మలో తెల్లటి చొక్కా.
వూరూరా వాడవాడలా ఆ వాల్‌పోస్టర్‌లు వెలిశాయి. ఎన్నాళ్ళయినా ఎవరూ ఒక్క సబ్బూ కొనలేదు. ఆరు నెలల తరువాత అసలు సంగతి తెలిసింది. సౌదీలో జనాలు కుడి నుండి ఎడమకు చదువుకుంటూ పోతారని!

First Published:  7 April 2015 1:30 PM IST
Next Story