రాహుల్ సారథ్యంలో కాంగ్రెస్‌లో చీలిక?
కాంగ్రెస్ పార్టీ చీలిక దిశలో పయనిస్తుందా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారు కొంతమంది సీనియర్ నాయకులు. పార్టీ సిద్ధాంతాలపై రాహుల్‌తో పార్టీలోని అనేకమంది సీనియర్లకు విభేదాలున్నాయని దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ అజాద్, జైరాం రమేష్ వంటి నాయకులు అంగీకరిస్తున్నారు. ఇది కేవలం వయస్సు తెచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ అని వారంటున్నారు. సీనియర్‌లతోనే కాదు తన తల్లి సోనియాగాంధీతో కూడా రాహుల్‌కు పడడం లేదని ఇది ఎంతవరకు తీసుకెళుతుందన్న దానికి సమాధానం తమవద్ద లేదని అంటున్నారు. ఈ పరిణామాలు పార్టీని […]
BY Pragnadhar Reddy7 April 2015 2:56 AM IST
X
Pragnadhar Reddy Updated On: 7 April 2015 2:56 AM IST
కాంగ్రెస్ పార్టీ చీలిక దిశలో పయనిస్తుందా? ఈ ప్రశ్నకు అవుననే అంటున్నారు కొంతమంది సీనియర్ నాయకులు. పార్టీ సిద్ధాంతాలపై రాహుల్‌తో పార్టీలోని అనేకమంది సీనియర్లకు విభేదాలున్నాయని దిగ్విజయ్‌సింగ్, గులాంనబీ అజాద్, జైరాం రమేష్ వంటి నాయకులు అంగీకరిస్తున్నారు. ఇది కేవలం వయస్సు తెచ్చిన కమ్యూనికేషన్ గ్యాప్ అని వారంటున్నారు. సీనియర్‌లతోనే కాదు తన తల్లి సోనియాగాంధీతో కూడా రాహుల్‌కు పడడం లేదని ఇది ఎంతవరకు తీసుకెళుతుందన్న దానికి సమాధానం తమవద్ద లేదని అంటున్నారు. ఈ పరిణామాలు పార్టీని నిలువునా చీల్చే పరిస్థితి కనిపిస్తోందని సీనియర్లంటున్నారు. ఆయన సుదీర్ఘ సెలవు తర్వాత ఈనెల 19న వస్తున్నారని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. ఆయన రాక, పార్టీ బాధ్యతలు చేపట్టడం కొంతమందికి అసంతృప్తి కలిగించవచ్చని మరో సీనియర్ నాయకుడు సందీప్ దీక్షిత్ అంటున్నారు. ఈ క్లిష్ట పరిస్థితిలో సోనియాగాంధీ తప్ప పార్టీ నాయకత్వానికి మరో గత్యంతరం లేదని ఆయన అన్నారు.
నిజానికి సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ పార్టీలో ప్రజాస్వామ్య విలువలను నెలకొల్పాలని అనుకుంటున్నారని, అయితే కొంతమంది సీనియర్లు దీనికి అడ్డుపడుతున్నారని దిగ్విజయ్‌సింగ్ చెబుతున్నారు. పార్టీలో సంస్కరణలు తీసుకురావడానికి వారికి ఇష్టం లేదు. పార్టీలోని కొంతమంది జూనియర్లు కీలక పదవులు చేపట్టడం ఆ సీనియర్లకు ఇష్టం లేదని అందుకే రాహుల్ వెనక ఉండి ఏం చేయాలో అర్ధంకాక సతమతమవుతున్నారని, సీనియర్లతో సమాన అవకాశాలు కలిగించాలని రాహుల్ అనుకుంటున్నా దాన్ని సీనియర్లు పడనీయడం లేదని అన్నారు. ప్రజాస్వామ్య సిద్ధాంతాలను నెలకొల్పడానికి ఎలాంటి చర్యకైనా సిద్ధపడాలని ఆయన భావిస్తున్నారని… ఇదెంతకు దారి తీస్తుందో అర్ధం కావడం లేదని దిగ్విజయ్ అంటున్నారు.
పార్టీలోని సీనియర్ నాయకులతోను, తల్లి సోనియాగాంధీతోను రాహుల్ అనేక విషయాల్లో విభేదిస్తున్నారని దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్ బాహాటంగానే చెబుతున్నారు. దీన్ని చేదు నిజంగా చాలామంది అభివర్ణిస్తూనే ఇదంతా జనరేషన్ గ్యాప్‌గా చెబుతున్నారు. సీనియర్లు ఇలాగే విభేదించడం కొనసాగిస్తే రాహుల్ వారిని బయటకు పంపించడానికి కూడా వెనుకాడరని వీరంటున్నారు. ఇదే జరిగితే సీనియర్లంతా తమ తమ స్థానాలు ఖాళీ చేసి వైదొలగాల్సిందే. ఒకవేళ సోనియాగాంధీ దీనికి వ్యతిరేకిస్తే పార్టీని ఎవరు చీలుస్తారన్న ప్రశ్నకు సమాధానం కాలమే చెప్పాలి.-పీఆర్
Next Story